Telangana Elections Results 2023 : జిల్లాల వారీగా ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీళ్లే.. మ్యాజిక్ ఫిగర్ కు చేరుకున్న కాంగ్రెస్
ప్రధానాంశాలు:
Telangana Elections Results 2023 : జిల్లాల వారీగా ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీళ్లే..
మ్యాజిక్ ఫిగర్ కు చేరుకున్న కాంగ్రెస్
Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయింది. ఈవీఎం నాలుగు రౌండ్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ చూస్తే కాంగ్రెస్ 62 స్థానాలు, బీఆర్ఎస్ 39 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. జిల్లాల వారీగా ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులను చూసుకుంటే.. ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 2, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
వరంగల్ లో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. హైదరాబాద్ లో బీఆర్ఎస్ 7, బీజేపీ 4, ఎంఐఎం 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్ 9, సీపీఐ ఒక స్థానంలో లీడ్ లో ఉన్నాయి. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.
వరంగల్ లో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కరీంనగర్ లో కాంగ్రెస్ 8, బీజేపీ 3 ఆధిక్యంలో ఉన్నాయి. రంగారెడ్డి లో బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 4, బీజేపీ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మెదక్ లో బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. నల్గొండలో 12 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది.