Telangana Elections Results 2023 : కామారెడ్డిలో కేసీఆర్ కు షాక్.. లీడ్ లో రేవంత్ రెడ్డి.. ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ లీడ్..!
ప్రధానాంశాలు:
Telangana Elections Results 2023 : కామారెడ్డిలో కేసీఆర్ కు షాక్.. లీడ్ లో రేవంత్ రెడ్డి..
ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ లీడ్..!
Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కామారెడ్డిలో బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డి పోటీ చేశారు. కొడంగల్ లోనూ పోటీ చేశారు. తాజాగా ఎన్నికల ఫలితాలు చూసుకుంటే.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. కొడంగల్ లోనూ రేవంత్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం రెండు రౌండ్లు ముగిశాయి. రెండు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది. కామారెడ్డిలో కేసీఆర్ కు షాక్ ఇచ్చి భారీ లీడ్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ 36 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఎంఐఎం 3, బీజేపీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్, మెదక్ తప్ప అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 స్థానాల్లో 2 స్థానాల్లో బీఆర్ఎస్, 4 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో 2 బీఆర్ఎస్, 5 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది.
కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా, 3 స్థానాల్లో బీఆర్ఎస్, 8 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జీవన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రామగుండం రాజ్ ఠాకూర్ ఆధిక్యంలో ఉన్నారు. మంథని నుంచి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లి నుంచి విజయ రామారావు ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ ఆధిక్యంలో ఉన్నారు. వేములవాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆధిక్యంలో ఉన్నారు. సిరిసిల్ల నుంచి కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. మానకొండూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ లో 9, సీపీఐ ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి 2వ రౌండ్ లో 6036 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ 7 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ 7, మహబూబ్ నగర్ బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 6, నల్గొండలో కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ 4, బీజేపీ 7, ఎంఐఎం 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దుబ్బాకలో రఘునందన్ రావు వెనుకంజలో ఉన్నారు.