Telangana Ration Card : తెలంగాణ‌లో కొత్త రేష‌న్ కార్డుల‌కి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు.. ఎవ‌రెవ‌రికి అందుతాయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Ration Card :  తెలంగాణ‌లో కొత్త రేష‌న్ కార్డుల‌కి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు.. ఎవ‌రెవ‌రికి అందుతాయి..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 January 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Telangana Ration Card :  తెలంగాణ‌లో కొత్త రేష‌న్ కార్డుల‌కి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు.. ఎవ‌రెవ‌రికి అందుతాయి..!

Telangana Ration Card :  సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విష‌యం తెలిసిందే. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు.. పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కూడా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

Telangana Ration Card తెలంగాణ‌లో కొత్త రేష‌న్ కార్డుల‌కి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు ఎవ‌రెవ‌రికి అందుతాయి

Telangana Ration Card :  తెలంగాణ‌లో కొత్త రేష‌న్ కార్డుల‌కి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు.. ఎవ‌రెవ‌రికి అందుతాయి..!

Telangana Ration Card : ఇవే మార్గ‌ద‌ర్శ‌కాలు..

ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న వినతుల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇక కొత్త రేషన్ కార్డులను ఏ ప్రాతిపదికను లబ్ధిదారులకు అందించనున్నారంటే?. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇటీవల జరిగిన కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన కోసం అందుకుంటారు. మండల స్థాయిలో ఎంపీడీవో లు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తారు.

కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, కమిషనర్‌లకు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు.. ఈ సందర్భంగా చదివి వినిపించి చర్చించిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు ఆమోదం లభించనుంది. . రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలుపై అధికారులతో చర్చించారు. ఇందులో కొత్త రేషన్ కార్డులపై కీలక విషయం వెల్లడించారు. ముఖ్యమైన తేదీలను వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల కోసం జనవరి 16 నుండి 20 వరకు తెలంగాణ అంతటా ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. 21 నుండి 24 వరకు గ్రామ, వార్డు సమావేశాల్లో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను ఉంచి, ప్రజల అభిప్రాయం తీసుకుంటామన్నారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూడా వెల్ల‌డించ‌డం జ‌రిగింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది