Home » News » Telangana Government Is Another Key Agreement For The Development Of Startups
News

Telangana : స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ‌ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: February 18, 2025, 11:55 pm
Advertisement

Telangana : స్టార్టప్‌ల అభివృద్ధికి Telangana రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్ (T-Hub), బ్రెజిల్‌లోని గోయస్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హబ్‌ గోయస్ (HUB GOIAS)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. Cm Revanth reddy  ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు హెచ్ఐసీసీలో హబ్ గోయస్ (HUB GOIAS) ప్రతినిధులతో చర్చలు జరిపారు.

Advertisement

Telangana : స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ‌ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం..!

అనంతరం T-Hub పౌండేషన్ సీఈవో సుజిత్ జాగిర్దార్ గారు, బ్రెజిల్ దేశ గోయస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో గారు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్‌లకు బ్రెజిల్‌లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్‌లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారం పంచుకుంటాయి.

Advertisement

మార్కెట్ యాక్సెస్‌తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై టీ-హబ్ (T-Hub), హబ్ గోయస్ (HUB GOIAS) కలిసి పని చేస్తాయి. రెండు దేశాల స్టార్టప్ ఎకో సిస్టమ్‌ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేయనుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి