
Pension : గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు
Pension : తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి ముఖ గుర్తింపు (ఫేసియల్ రికగ్నిషన్) విధానాన్ని ప్రవేశపెడుతూ, తొలిదశలో 23 లక్షల మందికి ఇది అమలు చేయనుంది. ముఖ్యంగా తపాలా శాఖ ద్వారా పింఛన్లు పొందే వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వితంతువులు, బీడీ, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితులకు ఈ విధానం వర్తించనుంది. వృద్ధుల వేళ్ల రేఖలు తొలిపోతుండటంతో బయోమెట్రిక్ పద్ధతి పనిచేయకపోవడం వల్ల కొంతమంది వారి పింఛన్ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ఫేసియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది.
Pension : గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు
ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి టీజీ ఆన్‌లైన్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. పోస్టుమాష్టర్లు, పోస్టుమ్యాన్‌లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఫోటోను ఆధార్‌లోని ఫోటోతో సరిపోల్చి గుర్తింపు నిర్ధారించిన అనంతరం, పింఛన్ చెల్లింపులు జరుపుతారు. ఫొటో ద్వారా గుర్తింపు సాధ్యపడని వారికి బయోమెట్రిక్ ద్వారా పింఛన్ ఇస్తారు.
రెండు పద్ధతులు ఫలించనప్పుడు, గ్రామ కార్యదర్శుల ధృవీకరణతోనే పింఛన్ అందిస్తారు. అయితే కొత్త విధానం అమలుతో కొన్నిచోట్ల అధికారులు ఆధార్‌తో పాటు ఓటర్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటివి తప్పనిసరిగా కోరుతుండటం వల్ల పలువురు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వయసును నిరూపించేందుకు ఆధార్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సరిపోతుండగా, ఇప్పుడు అధిక డాక్యుమెంట్లు కావాలనడం తిరకాసు పెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ తాజా పరిష్కార మార్గం ఎంతోమందికి మేలు చేయనుందన్న ఆశలు ఉన్నా, అమలులో పారదర్శకత, సహకారం లేకపోతే దీనివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.