Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడనుంది. రైతులకు శుభవార్త అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు తెలిపిన ప్రభుత్వం త్వరలో మరో రూ.13 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొంది. అయితే గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చింది. గత ప్రభుత్వం హయాంలో రూ.10 వేలు అందిస్తే తాము రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. కానీ ఏడాది అవుతున్నా ఇప్పటి వరకూ రైతులకు పెట్టుసాయం అందలేదు. వానకాలం సీజన్ కూడా దాదాపుగా ముగియవస్తుంది.
రైతు భరోసా డబ్బుల కోసం రైతులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాది వేడుకలను ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తేదీ వరకూ 26 రోజులు ఉత్సవాలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వేడుకల్లోనే రైతు భరోసా దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది. ఒక ఎకరా నుంచి ప్రారంభించి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో ప్రస్తుతం 1.39 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. మొత్తం రూ.7 వేల కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. దశలవారీగా అంటే ప్రతి 10 రోజులకు రూ.1500 నుంచి 2 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయవచ్చు. మొత్తం 45 రోజుల్లో ఈ ప్రక్రియ ముగించేందుకు ప్రణాళిక రచిస్తోంది. సాగు చేయని భూములకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు మొత్తాలను విడుదల చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆరోపించారు. సాగుకు నోచుకోని భూములకు గత ప్రభుత్వం రూ.25 వేల కోట్లు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Mega Heroes : అల్లు అర్జున్ నంద్యాల వెళ్లివచ్చినప్పటి నుంచి అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య ఫైట్ తెలిసిందే. సోషల్…
Ghee Coffee : ప్రస్తుత కాలంలో నెయ్యి కాఫీ బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఈ నెయ్యి కాఫీ…
Karthika Pournami : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో కార్తీక పౌర్ణమి ఒకటి. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి ప్రకాశంతో…
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
This website uses cookies.