Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా అమలకు తెలంగాణ స‌ర్కార్‌ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా అమలకు తెలంగాణ స‌ర్కార్‌ నిర్ణయం

 Authored By ramu | The Telugu News | Updated on :10 November 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా అమలకు తెలంగాణ స‌ర్కార్‌ నిర్ణయం

Rythu Bharosa : తెలంగా రైతుల‌కు ప్ర‌భుత్వ తీపి కబురు. రైతు భ‌రోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడనుంది. రైతులకు శుభవార్త అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు తెలిపిన ప్ర‌భుత్వం త్వరలో మరో రూ.13 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొంది. అయితే గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చింది. గత ప్రభుత్వం హయాంలో రూ.10 వేలు అందిస్తే తాము రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. కానీ ఏడాది అవుతున్నా ఇప్పటి వరకూ రైతుల‌కు పెట్టుసాయం అంద‌లేదు. వాన‌కాలం సీజ‌న్ కూడా దాదాపుగా ముగియ‌వ‌స్తుంది.

రైతు భ‌రోసా డబ్బుల కోసం రైతులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఏడాది వేడుకలను ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తేదీ వరకూ 26 రోజులు ఉత్సవాలు జరిపేందుకు ప్ర‌భుత్వం సిద్ధమైంది. ఈ వేడుకల్లోనే రైతు భరోసా దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది. ఒక ఎకరా నుంచి ప్రారంభించి డిసెంబర్ చివ‌రి నాటికి రైతు భరోసా పూర్తి చేయాలని ప్ర‌భుత్వం నిర్ణయించింది.

Rythu Bharosa రైతులకు శుభవార్త రైతు భరోసా అమలకు తెలంగాణ స‌ర్కార్‌ నిర్ణయం

Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా అమలకు తెలంగాణ స‌ర్కార్‌ నిర్ణయం

తెలంగాణలో ప్రస్తుతం 1.39 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. మొత్తం రూ.7 వేల కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. దశలవారీగా అంటే ప్రతి 10 రోజులకు రూ.1500 నుంచి 2 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయవచ్చు. మొత్తం 45 రోజుల్లో ఈ ప్రక్రియ ముగించేందుకు ప్రణాళిక రచిస్తోంది. సాగు చేయని భూములకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు మొత్తాలను విడుదల చేసిందని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు ఆరోపించారు. సాగుకు నోచుకోని భూములకు గత ప్రభుత్వం రూ.25 వేల కోట్లు ఇచ్చిందని ఆయ‌న పేర్కొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది