AIYF : ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలి : ఏఐవైఎఫ్
ప్రధానాంశాలు:
AIYF : ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలి : ఏఐవైఎఫ్
AIYF : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లోని తెలంగాణ Telangana హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హోంగార్డుల పక్షాన తెలంగాణ సచివాలయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,ఐపీఎస్ రవి గుప్తా కు ఏఐవైఎఫ్ బృందం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్ లు సంయుక్తంగా మాట్లాడుతూ గత 11సంవత్సరాలుగా తెలంగాణ స్థానికతకు చెందిన హోంగార్డులు ఆంధ్రప్రదేశ్ లో విధులు , అదే విధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ హోంగార్డులు పనిచేస్తున్నారన్నారు.

AIYF : ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలి : ఏఐవైఎఫ్
AIYF ఏఐవైఎఫ్ బృందం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతి
తెలంగాణ Telangana స్థానికతకు చెందిన హోంగార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెలక్ట్ అయినారు. రాష్ట్ర విభజన జూన్, 2014 తరువాత వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఉండిపోయారని, అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగినా, హోంగార్డులను మార్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణకు చెందిన హోంగార్డులు పనిచేస్తున్నారని, ఆ కుటుంబాలు తెలంగాణ లో ఉన్నాయన్నారు. దీనివలన వారు ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ లో, కుటుంబం తెలంగాణ లో ఉండటంవలన, మానసికంగా, కుటంబపరంగా, డ్యూటికి హాజరుకావడానికి, రవాణాపరంగా, ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. హోంగార్డుల తల్లితండ్రులు వృద్దాప్యంలో ఉండంటం వలన, వారి బాగోగులు చూసుకోలేకపోతున్నారన్నారు.కొంతమంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ లో విద్యను కొనసాగిస్తున్నారని. వారు భవిష్యత్తులో తెలంగాణ స్థానికతను కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్ర విభజన జూన్ 2014 నుంచి దాదాపుగా ’11’ సంవత్సరాలుగా స్వరాష్ట్రాలకు వెళ్ళాలని ఎదురుచూస్తున్నా, వారి సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలం చెందారని వాపోయారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కు హోంగార్డ్స్ బదిలీ చేయడానికి అభ్యంతరం లేదని తెలిపినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలయాపన చేసి స్పందించలేదన్నారు. తెలంగాణ హోంగార్డులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ లకు, పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. సత్య ప్రసాద్,ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ పాల్గొన్నారు.