telangana ministers to visit medigadda
Medigadda : తెలంగాణ మంత్రులు మేడిగడ్డకు బయలుదేరారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను కాళేశ్వరం సందర్శనకు తీసుకెళ్తానని.. అసలు అక్కడ జరిగిన అవినీతిని అందరికీ కళ్లకు కట్టినట్టు చూపిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ వద్ద క్రాక్ రావడంతో అది పెద్ద చర్చనీయాంశం అయింది. దీంతో కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ ప్రారంభించారు. తాజాగా మేడిగడ్డ సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లారు.
తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి మంత్రులు బయలుదేరారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై మంత్రులు సమీక్ష చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితిపై అధికారులు.. మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది. అసలు నిజంగా అయిన ఖర్చు ఎంత? నిర్మాణం కోసం ఎల్ అండ్ టీ కంపెనీకి ఎంత ఇచ్చారు? ఇలాంటి లెక్కలకు సంబంధించిన వివరాలను మంత్రులకు అధికారులు తెలియజేయనున్నారు.
Water | చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు..భోజనం చేస్తూనే లేదా చేసిన వెంటనే నీళ్లు తాగడం. అయితే ఆరోగ్య…
EGG | మార్కెట్లలో గుడ్లు చౌకగా లభించడంతో, చాలా మంది ఒకేసారి డజన్ల కొద్దీ గుడ్లు కొనుగోలు చేస్తున్నారు. అలాగే…
Hibiscus Plant Vastu Tips | భారతీయ సంప్రదాయంలో మొక్కలు, పూలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పూజల్లో, వాస్తులో, ఆరోగ్య…
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…
Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో శనివారం…
This website uses cookies.