Fine Rice : 80 వేల పుస్తకాలు చదివినోడు సన్నబియ్యం ఇవ్వలేదు.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
ప్రధానాంశాలు:
Fine Rice : 80 వేల పుస్తకాలు చదివినోడు సన్నబియ్యం ఇవ్వలేదు.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
Fine Rice : ఉగాది పండుగను పురస్కరించుకుని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హుజూర్‌నగర్ వేదికగా రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ పథకం చరిత్రలో నిలిచిపోయేలా అమలు చేయబోతున్నాం. భవిష్యత్తులో ఎవరూ దీన్ని రద్దు చేయలేరని ఖచ్చితంగా చెప్పగలను. పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు.

Fine Rice : 80 వేల పుస్తకాలు చదివినోడు సన్నబియ్యం ఇవ్వలేదు.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
Fine Rice చురకలు..
ప్రతి పేదవాడికి ఆరు కిలోల సన్నబియ్యం ఇవ్వాలని మంత్రి వర్గ సహచరులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాను. పేదవారికి కడుపు నింపాలని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం 80 వేల పుస్తకాలు చదివినోడు సన్నబియ్యం ఇవ్వలేదు. వరి వేస్తే ఉరేనని రైతులను భయపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వరి వేయోద్దు, వడ్డు కొనమని చెప్పి ఎర్రవెల్లి ఫాం హౌస్ లో 1000 ఎకరాల్లో వడ్లు పండించి క్వింటాల్ కు 4,500 లకు అమ్మాడు అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణలో 89.95 లక్షల రేషన్ కార్డులుండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు