Farmers : రైతుల‌కు తీపిక‌బురు.. సంక్రాంతి ముందే రైతు భరోసా నిధుల జ‌మ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : రైతుల‌కు తీపిక‌బురు.. సంక్రాంతి ముందే రైతు భరోసా నిధుల జ‌మ..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 December 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmers : రైతుల‌కు తీపిక‌బురు.. సంక్రాంతి ముందే రైతు భరోసా నిధుల జ‌మ..!

Farmers : రైతులకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం రాళ్లు, రప్పలు, గుట్ట‌లు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చిందని దుయ్య‌బ‌ట్టిన ఆయ‌న సీఎం రేవంత్ సర్కార్ అసలైన రైతులకు సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. రైతు భ‌రోసాపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ రైతులకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంపై ఆయ‌న‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంక్రాంతి కానుకగా రైతులకు రొక్కం అందిస్తామని అసెంబ్లీ వేదికగా రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రైతుభరోసా పథకానికి సంబంధించిన విధివిధానాల ఖరారుతో పాటు నిధుల సమీకరణపై దృష్టి సారించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

Farmers రైతుల‌కు తీపిక‌బురు సంక్రాంతి ముందే రైతు భరోసా నిధుల జ‌మ

Farmers : రైతుల‌కు తీపిక‌బురు.. సంక్రాంతి ముందే రైతు భరోసా నిధుల జ‌మ..!

రైతు బంధు మాదిరిగా నిధులు దుర్వినియోగం కాకుండా కీలక మార్పులు చేసి, సాగు చేసే భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. అయితే ప్రతిపక్షాలు రైతులను మాయమాటలు, అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేయవద్దన్నారు. అయితే, రైతు భరోసాకు పీఎం కిసాన్‌ నిబంధనలను వర్తింపజేస్తామన్న వార్తల్లో నిజం లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 2019-20లో రెండు పంటలకు రైతు బంధు డబ్బులు చెల్లించలేదని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. 2023 యాసంగిలో రూ.7,600 కోట్లు ఎగ్గొట్టిందని ధ్వజమెత్తారు. రైతుబంధు పేరుతో వ్యవసాయ యాంత్రీకరణ, పంటల బీమా, సూక్ష్మసేద్యం వంటి అన్ని పథకాలను అటకెక్కించిందన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పథకాల వాటా రూ.3,005 కోట్లు రాకుండా చేసిందని ఆరోపించారు. 2018లో ఏకంగా 20 లక్షల మందికి రుణమాఫీ చేయలేదని విమర్శించారు. పంటలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఊసే ఎత్తని సర్కార్, కనీసం రైతులను పరామర్శించలేదని మండిపడ్డారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి ప్రత్యక్షంగా 35 శాతం నిధులు కేటాయించిన‌ట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే పంటలకు రెండుసార్లు నష్ట పరిహారం చెల్లించామని తెలిపారు. ఏడాది కాలంలో రూ.695 కోట్లు వెచ్చించి ప్రతి పంటకు మద్దతు ధర కల్పించిందని గుర్తు చేశారు. సన్నాలకు రూ.500 బోనస్‌ ప్రకటించి, రైతులకు ప్రతి ఎకరాకు అదనంగా రూ.8-12 వేలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకుని రైతులను ఆదుకునేందుకు సరియైన సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల సూచించారు.

అయితే ఈ నెల 28న లబ్ధిదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నారు. రైతు భరోసాలో భాగంగా రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి ఇచ్చేందుకు సిద్ధమైన‌ట్లు స‌మాచారం. ఈ నెల 28న అర్హులైన కౌలు రైతులు, రైతు కూలీల ఖాతాల్లో పెట్టుబడి జమ చేయాలని ప్ర‌భుత్వం నిర్ణయిచింది. ఇందుకు రూ.6 వేల కోట్లు అవసరం కాగా ఇందుకు రూ.7 వేల కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. Telangana government, Sankranti, rythu bharosa, cm revanth reddy, minister tummala nageswara rao

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది