Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హరీశ్‌రావు
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నివేదికలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేలెత్తి చూపడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ నివేదికపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. 60 పేజీల నివేదిక కాకుండా, పూర్తి 655 పేజీల నివేదికను అసెంబ్లీలో పెట్టాలని, అప్పుడు తాము దానిని చీల్చి చెండాడతామని ఆయన సవాల్ విసిరారు.
Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హరీశ్‌రావు
హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘోష్ కమిషన్ నివేదికపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రిపోర్ట్ మొత్తం ‘ట్రాష్’ లాగా ఉందని ఆయన అభివర్ణించారు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం రిపోర్టులు ఇచ్చాయని, కానీ అలాంటివి ఏవీ కూడా న్యాయస్థానాల్లో నిలబడలేదని ఆయన గుర్తు చేశారు. ఇందిరా గాంధీ, చంద్రబాబు నాయుడు మీద కూడా కమిషన్లు వేశారని, కానీ అవి కోర్టుల్లో నిలబడలేదని ఉదాహరణగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈ నివేదికను రూపొందించిందని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిపై హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒకవైపు ‘కాళేశ్వరం కూలిపోయింది’ అని చెబుతూనే, మరోవైపు యాదాద్రి జిల్లాకు వెళ్లి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టడం, మల్లన్నసాగర్ నుండి మూసీలోకి నీళ్లు పోయడానికి రూ.6000 కోట్ల టెండర్లు ఖరారు చేయడం ఏంటని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమేనని, కాళేశ్వరం నీళ్లే గంధమల్ల ప్రాజెక్టుకు వెళ్తాయని ఆయన స్పష్టం చేశారు. ‘కాళేశ్వరం కూలిందని అబద్ధపు మాటలు చెప్పి.. గంధమల్లకు కొబ్బరికాయలు కొట్టి, మల్లన్నసాగర్‌కు టెండర్లు ఎలా ఖరారు చేస్తావ్ బిడ్డా రేవంత్ రెడ్డి?’ అంటూ హరీశ్ రావు తీవ్రంగా నిలదీశారు.
మహారాష్ట్రతో కేసీఆర్ చేసుకున్న చారిత్రాత్మక నీటి ఒప్పందాల గురించి కూడా హరీశ్ రావు ప్రస్తావించారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తాము 152 మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే మీరు ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారని, దానికి కేసీఆర్ ఆ విషయం నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి 650 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై చర్చ పెట్టాలని, అప్పుడు నిజాలు ప్రజలకు తెలిసేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్ రావు సవాల్ చేశారు. శాసనసభ వేదికగా తాము ఈ అంశాన్ని పూర్తిస్థాయిలో చర్చకు పెడతామని ఆయన అన్నారు.
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
This website uses cookies.