Home » News » This Is The Scheme That Is Going To Be A Game Changer In Telangana
News

Telangana : నిరుద్యోగ యువత గుడ్‌న్యూస్‌.. తెలంగాణ లో గేమ్ ఛేంజర్ కాబోతున్న స్కిం ఇది..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 17, 2025, 7:00 pm
Advertisement

Telangana : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గొప్ప ఆదరణ పొందుతోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల్లోని ఐదు లక్షల మందికి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.6,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగియగా, ప్రస్తుతం అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా యువత తమ స్వంత వ్యాపారాలు ప్రారంభించి, ఆర్థికంగా ఎదిగే అవకాశాన్ని కల్పించనుంది.

Advertisement

Telangana : నిరుద్యోగ యువత గుడ్‌న్యూస్‌.. తెలంగాణ లో గేమ్ ఛేంజర్ కాబోతున్న స్కిం ఇది..!

Telangana నిరుద్యోగ యువత కోసం రూ.6,000 కోట్ల బడ్జెట్‌ .. రేవంతా మజాకా

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి పథకం అమలుపై కీలక సూచనలు చేశారు. లబ్ధిదారులకు సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే, బ్యాంకులు లింకేజీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే బ్యాంకులు తమ లింకేజీ మొత్తాలను ఏఎంఐల రూపంలో తీసుకోవద్దని, పూర్తి మొత్తాన్ని లబ్ధిదారుల వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం రెండు దశల్లో అమలవుతుందని, మొదట కొంత మొత్తాన్ని విడుదల చేసి, యూనిట్ స్థాపించిన తరువాత మిగిలిన సబ్సిడీ అందిస్తామని చెప్పారు.

Advertisement

అంతేకాక లబ్ధిదారులకు వ్యాపారం నిర్వహణపై 3 రోజుల నుంచి 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చే ఏర్పాటు కూడా ఉంది. వ్యాపారం ప్రారంభించిన తరువాత ఎదురయ్యే సమస్యలకు శిక్షణ సంస్థలు మద్దతుగా నిలబడతాయని భట్టి తెలిపారు. ఇది ఒక గేమ్ ఛేంజర్ పథకంగా నిలవనుందని, బ్యాంకులు కూడా దీనిలో భాగస్వాములై యువతకు భవిష్యత్తు నిర్మించడంలో తోడ్పడాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లక్షలాది మంది యువత ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉన్నందున, ఇది రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారనుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి