TS SSC Results 2025 : టెన్త్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. మెమో విధానంలో కీలక మార్పులు చేసిన తెలంగాణ సర్కార్..!
TS SSC Results 2025 : తెలంగాణ రాష్ట్రంలో TS SSC Class 10th Results 2025 పదో తరగతి 10th Results 2025 పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు విడుదల కాగా, తెలంగాణలో మాత్రం ఫలితాల వెల్లడి కొంత ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 30వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
TS SSC Results 2025 : టెన్త్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. మెమో విధానంలో కీలక మార్పులు చేసిన తెలంగాణ సర్కార్..!
మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, సమాధాన పత్రాల వెరిఫికేషన్ వంటి కార్యాచరణలు వారం రోజుల క్రితమే పూర్తయ్యాయి. ముందుగా మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావించినప్పటికీ, చివరికి ఈ బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించారు. ఫలితాల విడుదల అనంతరం నెల రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈసారి టెన్త్ మెమో విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రేడింగ్ మాత్రమే చూపించబడేది. అయితే ప్రస్తుతం నుంచి ప్రతి సబ్జెక్టులో పొందిన మార్కులు కూడా మెమోలో చూపించనున్నారు. అంతేకాదు ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మార్కులు మరియు మొత్తం జీపీఏ వివరాలు కూడా మెమోలో ఉంటాయి. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ TS SSC మార్క్స్ మెమో 2025ను తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్లు bse.telangana.gov.in లేదా bseresults.telangana.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.