
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష.. ఆ గండాలు గట్టెక్కుతారా..!
Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు అందుకున్నప్పటి నుండి తెలంగాణలో రాజకీయం చాలా వాడివేడిగా సాగుతుంది. ఆయన మరి కొద్ది రోజులలో ఏడాది కూడా పూర్తి చేసుకోబోతున్నాడు. అయితే ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్లారు, ఆయన ముందు ఉన్న రెండు సవాళ్లని ఎలా అధిగమించబోతున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక, పోలింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉండగా, ఫలితాలు ఎలా దానిపై కూడా ఆసక్తి నెలకొని ఉంది. పేదలకి సంబంధించి రేవంత్ రెడ్డి ఆ రెండు విషయాలలో ఎలా ముందుకు సాగుతాడు అని అందరు ఎదురు చూస్తున్నారు.
వికారాబాద్‌లోని లగచర్ల గ్రామీణ ప్రాంతంలో వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో పెట్టే ఫార్మా సిటీ వ్యవహా రం రేవంత్ సర్కారుకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. కలెక్టర్ పై దాడి ఒకవైపు రాజకీయ రచ్చ, చర్చగా మారగా మరోవైపు ఈ కేసులో దళితులను అరెస్టుచేసి జైల్లో పెట్టడం.. లాఠీ చార్జి చేయడం వంటివి జాతీయస్థాయిలో చర్చకు వచ్చాయి. పేదల కుటుంబాలతోపాటు.. ఎస్టీ సామాజిక వర్గాలతో ముడి పడిన వ్యవహారం కావడంతో దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ క్రమంలో పారిశ్రామికంగా వేసే అడుగులు.. సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయం వంటివి ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి మలుపులు తిప్పుతాయా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష.. ఆ గండాలు గట్టెక్కుతారా..!
మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా హైదరాబాదీ ల మనసు దోచుకోవడంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుకోవాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనగా ఉంది. మూసీ ప్రాజెక్టును మెరుగు పరచడం ద్వారా తెలంగాణకు గొప్ప పేరు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిసతుండగా, కొన్ని రాజకీయ పార్టీలు వాటికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఒకరిద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఈ వ్యవహారంలో చేస్తున్న వ్యాఖ్యలు సైతం సర్కారుకు తలనొప్పిగా మారింది. మరోవైపు మూసీని ప్రక్షాళన చేసే తీరుతామని రేవంత్ చెబుతున్నా..ఆయన వాటిని ఎలా చేధిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. అగ్ని పరీక్షలని రేవంత్ రెడ్డి ఎలా చేదిస్తాడు అని కూడా ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
Whatsapp : వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…
This website uses cookies.