Venu Swamy :ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ మధ్య తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ ఫైర్ అయ్యాయి. ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశాయి. ఇక వేణు స్వామిని అరెస్ట్ చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని న్యూస్ ఛానెల్స్ ఊదరగొట్టేస్తున్నాయి. సమయం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి.. అందులో అన్ని విషయాలు గురించి మాట్లాడాతా అంటూ.. ఓ వార్నింగ్ ఇచ్చారు వేణు స్వామి. కాని ఇప్పుడు ఆయన తన భార్యతో కలిసి ఓ వీడియో చేయగా, ఇందులో తాము ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు.
జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ.. టీవీ 5 డిబేట్‌లతో స్వామి వారి యవ్వారాలన్నింటికీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి. అయితే జర్నలిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాంట్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణు స్వామి దంపతులు. ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు వేణుస్వామి.నన్ను జర్నలిస్ట్ మూర్తి 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి నాపై దాడి చేయడం ప్రారంభించారు. నన్ను నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. వాళ్లు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు. గత ఎనిమిది నెలల నుంచి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో నాపై దాడులు ప్రారంభించారు.
డబ్బులు ఇచ్చి.. కొంతమంది జ్యోతిష్యులను తీసుకుని వచ్చి నాకు వ్యతిరేకంగా టీవీలో డిబేట్ పెడుతున్నారు. నా గురించి చెడుగా ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి చేస్తున్నారు. ఎంతోమంది కష్టాలను తొలగించిన నన్ను.. ఆత్మహత్య చేసుకునే స్థితికి నేను వెళ్లడం జరిగింది. నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. గత 8 నెలలుగా నేను దాదాపు 15 కేజీలు బరువు తగ్గిపోయాను. దీనంతటికీ కారణం ఏంటో మీరే చూడండి అంటూ ఓ ఆడియో రిలీజ్ చేశారు వేణు స్వామి దంపతులు. వీళ్ల సంభాషణలో వినిపించిన పేర్లు చూస్తే.. మొన్న వేణుస్వామిపై మహిళా కమీషన్‌కి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరెవరు ప్రముఖ జర్నలిస్ట్‌లు అయితే వెళ్లారో.. వాళ్ల పేర్లు పనికట్టుకుని పలకడాన్ని బట్టి చూస్తుంటే ఇదేదో కాస్త తేడాగానే కనిపిస్తుంది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.