Mega Brother : ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకున్న విషయం తెలిసిందే. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోం తమ దరఖాస్తులను పార్టీకి అందజేస్తున్నారు. పార్టీలో తాము చాలా కష్టపడ్డామని.. ఆర్థికంగా నష్టపోయామని, తమపై కేసులు కూడా ఉన్నాయని దరఖాస్తుల్లో చూపుతున్నారు.తొలి దశ విడత పోస్టులను ప్రకటించేలా ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 23,000 మంది నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఈ పదవుల భర్తీ విషయంలో ఇప్పటికే జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ఏపీ బీజేపీ అధ్యక్షురాలు , రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరితో చంద్రబాబు చర్చించారు.
ఈ సందర్భంగా దశలవారీగా ఈ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు.మూడు పార్టీలలోని నాయకులకు ఏ విధంగా పదవులు కేటాయించాలనే విషయం పైన ఒక క్లారిటీకి వచ్చారు. .మెగా బ్రదర్ నాగబాబుకూ కీలకమైన పదవిని కేటాయించబోతున్నట్లు సమాచారం. అలాగే బిజెపిలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారట. టీటీడీ ఛైర్మన్ పదవి కోసం టీవీ ఛానల్ యజమాని పేరు ఖరారైనట్టు తెలుస్తుంది..టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు పేర సైతం పరిశీలనలోకి వచ్చిన టీటీడీ ఛైర్మన్ మీడియా సంస్థ అధినేతకే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు, డిజిటల్ కార్పోరేషన్ చైర్మన్ గా జివి రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అదే విధంగా దేవినేని ఉమాకు ఆర్టీసీ ఛైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్, పట్టాబికి పౌర సరఫరాల కార్పోరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ ఖరారైనట్లు పార్టీలో ప్రచారం నడుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 90 వరకు కార్పొరేషన్లు ఉండగా , వాటి చైర్మన్ లు , అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు.దాదాపు 30% పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.