Venu Swamy : జ‌ర్న‌లిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు.. మాకు ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మంటున్న వేణు స్వామి ఫ్యామిలీ వీడియో విడుద‌ల‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : జ‌ర్న‌లిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు.. మాకు ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మంటున్న వేణు స్వామి ఫ్యామిలీ వీడియో విడుద‌ల‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 August 2024,8:18 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : జ‌ర్న‌లిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు..మాకు ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మంటున్న వేణు స్వామి ఫ్యామిలీ వీడియో విడుద‌ల‌..!

Venu Swamy :ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ మ‌ధ్య తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఇటీవల నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ ఫైర్ అయ్యాయి. ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశాయి. ఇక వేణు స్వామిని అరెస్ట్ చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని న్యూస్ ఛానెల్స్ ఊదరగొట్టేస్తున్నాయి. సమయం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి.. అందులో అన్ని విషయాలు గురించి మాట్లాడాతా అంటూ.. ఓ వార్నింగ్ ఇచ్చారు వేణు స్వామి. కాని ఇప్పుడు ఆయ‌న త‌న భార్య‌తో క‌లిసి ఓ వీడియో చేయ‌గా, ఇందులో తాము ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని అన్నారు.

Venu Swamy ఆత్మ‌హ‌త్య చేసుకుంటాం..

జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ.. టీవీ 5 డిబేట్‌లతో స్వామి వారి యవ్వారాలన్నింటికీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి. అయితే జర్నలిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాంట్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణు స్వామి దంపతులు. ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు వేణుస్వామి.నన్ను జర్నలిస్ట్ మూర్తి 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి నాపై దాడి చేయడం ప్రారంభించారు. నన్ను నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. వాళ్లు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు. గత ఎనిమిది నెలల నుంచి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో నాపై దాడులు ప్రారంభించారు.

Venu Swamy జ‌ర్న‌లిస్ట్ మూర్తి రూ5 కోట్లు డిమాండ్ చేశాడు మాకు ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మంటున్న వేణు స్వామి ఫ్యామిలీ వీడియో విడుద‌ల‌

Venu Swamy : జ‌ర్న‌లిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు.. మాకు ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మంటున్న వేణు స్వామి ఫ్యామిలీ వీడియో విడుద‌ల‌..!

డబ్బులు ఇచ్చి.. కొంతమంది జ్యోతిష్యులను తీసుకుని వచ్చి నాకు వ్యతిరేకంగా టీవీలో డిబేట్ పెడుతున్నారు. నా గురించి చెడుగా ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి చేస్తున్నారు. ఎంతోమంది కష్టాలను తొలగించిన నన్ను.. ఆత్మహత్య చేసుకునే స్థితికి నేను వెళ్లడం జరిగింది. నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. గత 8 నెలలుగా నేను దాదాపు 15 కేజీలు బరువు తగ్గిపోయాను. దీనంతటికీ కారణం ఏంటో మీరే చూడండి అంటూ ఓ ఆడియో రిలీజ్ చేశారు వేణు స్వామి దంపతులు. వీళ్ల సంభాషణలో వినిపించిన పేర్లు చూస్తే.. మొన్న వేణుస్వామిపై మహిళా కమీషన్‌కి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరెవరు ప్రముఖ జర్నలిస్ట్‌లు అయితే వెళ్లారో.. వాళ్ల పేర్లు పనికట్టుకుని పలకడాన్ని బట్టి చూస్తుంటే ఇదేదో కాస్త తేడాగానే క‌నిపిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది