Venu Swamy : సీఎం రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం .. వేణు స్వామి జోస్యం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : సీఎం రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం .. వేణు స్వామి జోస్యం..!

 Authored By aruna | The Telugu News | Updated on :17 January 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : సీఎం రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం .. వేణు స్వామి జోస్యం..!

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటారు. ఇక తాజాగా ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకునే ప్రధాన రాజకీయం పరిణామాల గురించి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి గండం ఉందని వేణు స్వామి తెలిపారు. కాబట్టి ఆయన అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుకు సంబంధించిన ఆలోచనలు చేసుకోవడం ఉత్తమం అని ఆయన అన్నారు. అంతేకాదు తెలంగాణలో పదుల సంఖ్యలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్లు కూడా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

అలాగే తెలంగాణలో ముఖ్య నేత కొడుకు యువనేత వ్యక్తిగత జీవితం సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వేణుస్వామి చెప్పారు. మరో వంద రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలో ఒక ముఖ్యమంత్రికి, ఇద్దరు డిప్యూటీ సీఎంలకు ఆరోగ్య భంగంలు కనిపిస్తున్నాయని ఆయన వివరించారు. ఇక ప్రపంచ స్థాయి పరిణామాల గురించి కూడా చెబుతూ వేణు స్వామి ఓ హెచ్చరిక చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఓ మహమ్మారి రాబోతుందని అన్నారు. అది ఏదో ఒక రోగం లేదా కరోనా రూపంలో లేదా మరే రూపంలోనైనా ఒక ఉపద్రవం రాబోతుందని తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడో ఒకచోట వస్తుందని వేణు స్వామి అన్నారు. అయితే మన దేశంలో దాని తీవ్రత కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వివరించారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటీవల వేణుస్వామి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన చెబుతున్న జాతకాలు ఇటీవల బెడిసి కొడుతున్నాయి. ప్రభాస్ కెరియర్ పడిపోతుందని తెలంగాణలో మళ్లీ కేసిఆర్ వస్తారని జోస్యం చెప్పారు. కానీ ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు. దీంతో నెటిజన్స్ వేణు స్వామి జాతకాలు చెప్పడం మానేయాలంటూ ట్రోల్ చేశారు. అయినా కూడా వేణు స్వామి వాటన్నింటినీ కవర్ చేస్తూ జాతకాలు చెబుతూ వస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది