
why cm kcr is confused over two mlc seats
CM KCR : ఆ రెండు పేర్లపై కేసీఆర్ లో అయోమయం నెలకొన్నది. అవి ఏ సీట్లో తెలుసా? రెండు ఎంఎల్సీ స్థానాలు. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు స్థానాలు అవి. ఆ స్థానాల కోసం ఇప్పటికే తెలంగాణ కేబినేట్ కూడా ఆమోదం తెలిపింది. ఆ కేబినేట్ సమావేశంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఆమోదించి ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. ఆ ఫైల్ ను పంపించి చాలా రోజులు అవుతోంది. జులై 31నే ఆ ఫైల్ ను పంపించినా ఇప్పటి వరకు గవర్నర్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
నిజానికి ప్రభుత్వం నుంచి ఏ ఫైల్ వెళ్లినా గవర్నర్ ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసేయాలి. కానీ.. ఫైల్ పంపించి 18 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఆ ఫైల్ గవర్నర్ నుంచి రిటర్న్ కాలేదు. అసలు గవర్నర్ ఆ ఫైల్ ను చూశారా? లేదా? అనేది కూడా డౌటే. గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని ఎంఎల్సీగా గవర్నర్ కు సిఫారసు చేసినప్పుడు కూడా గవర్నర్ ఆ ఫైల్ పై సంతకం పెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు.
why cm kcr is confused over two mlc seats
అయితే.. ప్రస్తుతం గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో ఎవైనా అభ్యంతరాలు ఉంటే గవర్నర్ కు ప్రభుత్వానికి నివేదించాలి. కానీ.. ఆ పని కూడా చేయడం లేదు. అటు అభ్యంతరాలు చెప్పకుండా.. ఫైల్ పై సంతకం చేయకుండా గవర్నర్ కాలాయాపన చేస్తుండటంతో ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లపై కేసీఆర్ కు టెన్షన్ స్టార్ట్ అయిందట. వేరే పేర్లు సూచిద్దామన్నా.. గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలా అని కేసీఆర్ డైలెమ్మాలో పడినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఈ విషయం ఇంకెంత దూరం వెళ్తుందో?
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.