CM KCR : ఆ రెండు సీట్లపైనే కేసీఆర్‌లో టెన్షన్.. ఎందుకు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

CM KCR : ఆ రెండు సీట్లపైనే కేసీఆర్‌లో టెన్షన్.. ఎందుకు?

CM KCR : ఆ రెండు పేర్లపై కేసీఆర్ లో అయోమయం నెలకొన్నది. అవి ఏ సీట్లో తెలుసా? రెండు ఎంఎల్సీ స్థానాలు. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు స్థానాలు అవి. ఆ స్థానాల కోసం ఇప్పటికే తెలంగాణ కేబినేట్ కూడా ఆమోదం తెలిపింది. ఆ కేబినేట్ సమావేశంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఆమోదించి ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. ఆ ఫైల్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 August 2023,10:00 am

CM KCR : ఆ రెండు పేర్లపై కేసీఆర్ లో అయోమయం నెలకొన్నది. అవి ఏ సీట్లో తెలుసా? రెండు ఎంఎల్సీ స్థానాలు. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు స్థానాలు అవి. ఆ స్థానాల కోసం ఇప్పటికే తెలంగాణ కేబినేట్ కూడా ఆమోదం తెలిపింది. ఆ కేబినేట్ సమావేశంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఆమోదించి ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. ఆ ఫైల్ ను పంపించి చాలా రోజులు అవుతోంది. జులై 31నే ఆ ఫైల్ ను పంపించినా ఇప్పటి వరకు గవర్నర్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

నిజానికి ప్రభుత్వం నుంచి ఏ ఫైల్ వెళ్లినా గవర్నర్ ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసేయాలి. కానీ.. ఫైల్ పంపించి 18 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఆ ఫైల్ గవర్నర్ నుంచి రిటర్న్ కాలేదు. అసలు గవర్నర్ ఆ ఫైల్ ను చూశారా? లేదా? అనేది కూడా డౌటే. గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని ఎంఎల్సీగా గవర్నర్ కు సిఫారసు చేసినప్పుడు కూడా గవర్నర్ ఆ ఫైల్ పై సంతకం పెట్టడానికి చాలా సమయం తీసుకున్నారు.

why cm kcr is confused over two mlc seats

why cm kcr is confused over two mlc seats

CM KCR : అభ్యంతరాలను కూడా చెప్పని గవర్నర్?

అయితే.. ప్రస్తుతం గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో ఎవైనా అభ్యంతరాలు ఉంటే గవర్నర్ కు ప్రభుత్వానికి నివేదించాలి. కానీ.. ఆ పని కూడా చేయడం లేదు. అటు అభ్యంతరాలు చెప్పకుండా.. ఫైల్ పై సంతకం చేయకుండా గవర్నర్ కాలాయాపన చేస్తుండటంతో ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లపై కేసీఆర్ కు టెన్షన్ స్టార్ట్ అయిందట. వేరే పేర్లు సూచిద్దామన్నా.. గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలా అని కేసీఆర్ డైలెమ్మాలో పడినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఈ విషయం ఇంకెంత దూరం వెళ్తుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది