Revanth Reddy : ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఎందుకు అతిగా ప్రవర్తిస్తున్నారు ..?
Revanth Reddy : ఏ రాజకీయ నాయకులకు అయినా మాటలు సవాళ్లు విమర్శలు సర్వసాధారణం. అయితే వాటిపట్ల ఎవరు ఎలా స్పందిస్తున్నారనేది ముఖ్యం. ఈ సవాళ్లను వారు తేలికగా తీసుకుంటున్నారా లేదా ఆ సవాళ్లను జడుసుకుంటున్నారా అనేది వారి స్పందనను బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తున్న తీరు బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకుల సవాళ్లకు ఆయన జడుసుకుంటున్నారని అనుమానం కలిగించేలా ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రెండు మూడు వారాల నుంచి రెండు పార్టీలు తమ జోస్యం మొదలుపెట్టాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని వారు పదే పదే చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం ఉండదని రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని అటు బీజేపీ నాయకులు అనేక సందర్భాలలో చెప్పారు.
అయితే సుస్థిరమైన మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ సర్కార్ సాధారణ పరిస్థితుల్లో కోల్పోవడం అంటే అంత సులభం కాదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తమ ప్రతిపక్ష నాయకుల సవాళ్లకు భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల మహబూబ్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత రెడ్డి రెచ్చిపోయి మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు మీ సంగతి చూస్తా అంటూ హెచ్చరించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదని కూడా అన్నా.రు ఈ వాక్యాలన్ని బాగానే ఉన్నా కానీ ప్రభుత్వాలను కూల్చడమే బీఆర్ఎస్, బీజేపీ సంస్కృతి అంతే అంటూ చెప్పిన కొన్ని మాటలు ఆయనలోని భయాన్ని సూచిస్తున్నాయి.
అంతేకాదు 40% ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని కూలగొడతామని అనడం ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా అని అందరూ ఆలోచించాల్సి ఉంటుందని, దుర్మార్గమైన రాజకీయాలకు పాతర వేయాలి. మా ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడతా అంటున్నారు అంటూ ఆయన పలికిన మాటలు బేలగా ఉన్నాయి. ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగానే ఏమైనా ప్రమాదం పొంచి ఉన్నదని భయపడుతున్నారా లేదా ఇలాంటి మాటల ద్వారా తమ మీద కుట్ర జరుగుతుందని ప్రచారం చేసి ప్రజల సానుభూతి సంపాదించాలని చూస్తున్నారా. లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టాలని అనుకుంటున్నారా అనేది బోధపడడం లేదు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కోల్పోతుంది అనే ప్రతిపక్ష నాయకుల మాటలు పట్ల రేవంత్ రెడ్డి అతిగా ప్రవర్తిస్తున్నారని మాత్రం అర్థం అవుతుంది.
AIYF : యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని, మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత…
Bhuma Akhila Priya : ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాజాగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహోబిలంలో…
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద పేదలకు గృహాలు అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా రాష్ట్ర కాంగ్రెస్…
Ambati Rambabu : జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి…
Pawan Kalyan : అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభ కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
New Ration Cards : ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట…
హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని, గణపతి ఆలయ దర్శనం,…
Today Gold Price : భారతీయుల్లో బంగారం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా మహిళలకైతే పసిడిపై అపారమైన ప్రేమ…
This website uses cookies.