Home » Andhra Pradesh » Rgv Making Such Films To Defeat Chandrababu Naidu
andhra pradesh

RGV : చంద్రబాబు నాయుడుని ఓడించాలనే ఆర్జీవీ ఇలాంటి సినిమాలు తీస్తున్నారా..?

Authored By
Ramu
The Telugu News | Published on: March 7, 2024, 8:00 pm
Advertisement

RGV : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా స్టైల్ వేరేలా ఉంటుంది. ఆయన చేసే ప్రతి సినిమా కూడా వివాదాలతో విడుదలవ్వడం విశేషం. ఇక తాజాగా ఆయన తెరకెక్కించిన ‘ వ్యూహం ‘ సినిమా మార్చి 2న విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా వ్యూహం సినిమాను ఆర్జీవి తెరకెక్కించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ నటించగా, వైయస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. ఇక చంద్రబాబు నాయుడు పాత్రలో ధనంజయ్ ప్రభునే నటించారు.

Advertisement

ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా నారా లోకేష్ ఈ సినిమాపై హైకోర్టులో కేసు వేశారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ సినిమా మార్చి 2న విడుదలైంది. ఇక ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తున్న వేళ వ్యూహం సినిమా విడుదల అవ్వడంపై చాలా చర్చ జరిగింది. ఎట్టకేలకు ఆర్జీవి ఈ సినిమాను విడుదల చేశారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవి చంద్రబాబు నాయుడు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తో నాకు అసలు పరిచయం లేదని, ఇప్పటివరకు ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడలేదని, ఇక అలాంటప్పుడు నాకు ఆయన పై ద్వేషం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నేను ఒక ఫిల్మ్ మేకర్ గా రాష్ట్రంలో జరిగిన ఒక విషయాన్ని సినిమాగా తీశాను. ఆయనపై నాక ఎటువంటి ద్వేషం లేదు. ఇక వ్యూహం సినిమాలో వాళ్లకి ఏదో సంబంధించి నేను చూపిస్తానని, నేను చూపించేది నిజమే అని ఎందుకు అనుకుంటారని,

కానీ టీడీపీ వాళ్లు నేను చూపించేది నిజమని అనుకుంటారు. వ్యూహంలో నాకు అనిపించిన నిజాలను చూపించానని అన్నారు. ఇక వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక రాజకీయాలలోకి వచ్చి టైం వేస్ట్ చేసుకునే అవసరం నాకు లేదని అన్నారు. ప్రజలకు సేవ చేయడం నాకు ఇష్టం లేదని, నా సేవ నేనే చేసుకుంటానని ఆర్జీవి వ్యాఖ్యానించారు. వ్యూహం సినిమా స్క్రిప్ట్ ని వైయస్ జగన్ కి చెప్పలేదని, ట్రైలర్, సినిమా కూడా వాళ్లకు చూపించలేదని చెప్పారు. నేను సినిమా తీయడం వరకే, అది సబ్జెక్టు నచ్చితే చూస్తారు, నేను చూడమని ఎవరికీ చెప్పను అని ఆర్జీవీ కామెంట్ చేశారు.

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి