
New Ration Cards : రేవంతయ్య.. ఎక్కడయ్య కొత్త రేషన్ కార్డులు.. కళ్లు కాయలు కాస్తున్నాయి కానీ..!
New Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది పేద ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా, ఇప్పటివరకు కేవలం 32వేల కుటుంబాలకు మాత్రమే కార్డులు మంజూరయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన, గ్రామసభలు, మీసేవ కేంద్రాల ద్వారా దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు అందగా, కుటుంబసభ్యుల పేర్ల చేర్పుల కోసం 8.10 లక్షల అభ్యర్థనలు వచ్చాయి. అయితే అర్హతలేని వారు లబ్ధి పొందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ప్రస్తుతం 10.50 లక్షల మందికి చేర్పులు పూర్తయ్యి మే నెల రేషన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నారు.
New Ration Cards : రేవంతయ్య.. ఎక్కడయ్య కొత్త రేషన్ కార్డులు.. కళ్లు కాయలు కాస్తున్నాయి కానీ..!
దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది జరుపుతూ, అభ్యర్థుల ఆదాయ స్థితిగతులు, గత రేషన్ కార్డు వివరాలు, తల్లిదండ్రుల పేరిట కార్డుల్లో పేర్లు ఉన్నాయా వంటి అంశాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే మరో రెండు నెలల్లో మిగిలిన అర్హులకూ కార్డులు మంజూరయ్యే అవకాశం ఉంది. మే నెల నాటికి రాష్ట్రంలో రేషన్ లబ్దిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరినట్టు సమాచారం. కొత్తగా 11.15 లక్షల మంది ఈ జాబితాలో చేరారు. జనవరి నుండి ఏప్రిల్ వరకు 19.15 లక్షల మంది లబ్దిదారులుగా గుర్తించగా, పాత కార్డుల నుంచి 7.10 లక్షల పేర్లు తొలగించబడ్డాయి.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కోటా కోలాహలంగా కొనసాగుతోంది. బియ్యం మొదటి రోజు నుంచే డీలర్ల వద్ద క్యూ కడుతున్న లబ్దిదారుల రద్దీతో సరఫరా ఐదు రోజులలోనే పూర్తవుతోంది. ఏప్రిల్‌లో 90 శాతం మందికి రేషన్ అందినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో డీలర్లు పూర్తిగా కోటా తెప్పించకపోవడంతో కొందరికి రేషన్ అందలేదు. మే నెలలో కొత్త లబ్దిదారులు పెరగడంతో పంపిణీ మరింత గిరాకీగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరఫరా వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.