YS sharmila : తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కొత్త పార్టీ పెట్టబోతుందని తెలిసిన రోజు నుండి ఆమెపై రోజుకో పార్టీ చొప్పున విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఎవరో ఆమె వెనుక నుండి నడిపిస్తున్నారని, ఆమె ఎవరో వదిలిన బాణమని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమో కేసీఆర్ వదిలిన బాణమని ఆరోపిస్తుంటే, బీజేపీ ఏమో తెరాస వదిలిన బాణమని విమర్శలు గుప్పిస్తుంది. ఇలాంటి తరుణంలో షర్మిల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
YS sharmila : ఎవరో వదిలిన బాణాన్ని కాదు
తాను ఎవరో వదిలిన బాణం కాదని, తెలంగాణలో రాజన్నరాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీనీ ఏర్పాటు చేస్తున్నట్టు షర్మిల చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 9వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని, లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ లోని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఆమె సమావేశాలు నిర్వహిస్తుంది. ఖమ్మం లో నిర్వహించిన సభలో ఆమె పై వ్యాఖ్యలు చేసింది.
ఇదే సమయంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీచేయాల్సిన స్థానంపై ఇప్పటికే సర్వేలు మొదలైనట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలొని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె అభిమానులు చెప్పినట్లు తెలుస్తుంది. ఖమ్మంలో వైఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో జగన్ పార్టీకి అక్కడ భారీగానే ఓట్లు లభించాయి. పైగా ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు కలిగిన జిల్లా కావటంతో అక్కడ ఆంధ్ర ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే షర్మిల అక్కడ నుండి పోటీచేయాలనే మాటలు వినిపిస్తున్నాయి.
అయితే తెలంగాణలో బలమైన తెరాస ను తట్టుకొని నిలబడటం షర్మిలకు చాలా కష్టమైన వ్యవహారమే అని చెప్పాలి. అయితే మొదటిగా వైఎస్ అభిమానులకు దగ్గర కావటం, ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవటం అదే సమయంలో ఎస్పీ, ఎస్టీ వర్గాలకు దగ్గర కావటం కూడా షర్మిల కు చాలా అవసరం, ఆ దిశగానే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. పైకి మతాల, కులాల ప్రాతిపదికన రాజకీయాలు చేయటం మా ఉద్దేశ్యం కాదని చెప్పిన కానీ, తెలుగు రాష్ట్రల రాజకీయాల్లో ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా కుల, మతాల రాజకీయం అనేది అవసరం.ఎవరు కూడా కాదనలేని పచ్చి నిజం.. ఇప్పుడు షర్మిల కూడా ఇదే కోవలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.