Amala : సమంత నాగ చైతన్య విడాకులపై స్పందించిన అమల
Amala : అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. అయితే, అలా జరగకూడదని, వారు కలిసి మెలిసి ఉండాలని చాలా మంది కోరుకున్నారు. కానీ, అలా జరగలేదు. తాము ఎవరి దారిలో వారు ముందుకు వెళ్తామని సమంత, నాగచైతన్య ప్రకటించేశారు. ఈ క్రమంలోనే విడాకుల పట్ల భావోద్వేగ పూరిత ట్వీట్ చేశాడు అక్కినేని నాగార్జున.సమంత-చైతన్యకు దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్టు నాగార్జున ట్వీట్ చేశారు. ఇకపోతే ఈ విడాకులు గురించి అక్కినేని అమల కూడా స్పందించారని తెలుస్తోంది. ఆమె కూడా వారిద్దరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు సమాచారం.
Amala About On samantha naga chaitanya divorce
Amala : అక్కినేని హీరోలకు పెళ్లిళ్లు కలిసిరావు..!
ఇకపోతే సమంతతో అక్కినేని అమలకు మంచి రిలేషన్ ఉందని చెప్పొచ్చు. పలు ఇంటర్వ్యూల్లో సమంతతో తనకున్న అనుబంధాన్ని అమల పంచుకుంది కూడా. తన అత్తయ్య అన్నపూర్ణ ఎలాగైతే తనను చూసుకుందో అదే మాదిరిగా తాను సమంతను చూసుకుంటానని చెప్పింది. ఇకపోతే తమ ఇంటికి ధైర్యవంతురాలైన, ప్రతిభావంతురాలైన సమంత కోడలుగా రావడం పట్ల అమల ఆనందం వ్యక్తం చేసింది. ఇకపోతే తాను, సమంత వంట గది వైపునకు అస్సలు తొంగి చూడబోమని, మంచి కుక్ ఉన్నారని అమల పేర్కొంది. అయితే, సమంత-చైతన్య విడిపోవడాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోయినప్పటికీ వారి నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరముందని అమల పేర్కొనట్లు వినికిడి.
naga chaitanya interesting decision after divorce
ఇకపోతే సమంత విడాకుల ప్రకటన తర్వాత చేసిన పోస్టు పట్ల నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నెగెటివిటీ స్ప్రెడ్ చేసేలా సమంత వ్యవహరిస్తున్నదని, ఈ క్రమంలోనే కావాలని ఇలాంటి పోస్టులు పెడుతున్నదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అక్కినేని వారికి పెళ్లిళ్లు కలిసి రావని కొందరు చెప్తున్నారు. గతంలో నాగార్జున దగ్గుబాటి లక్ష్మిని మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత డైవోర్స్ ఇచ్చారు. అలాగే నాగార్జున మేనల్లుడు సుమంత్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత పలు కారణాలతో విడాకులు ఇచ్చేశాడు. ఇక అఖిల్ మ్యారేజ్ అయితే ఎంగేజ్ మెంట్‌తోటే ఫుల్ స్టాప్ పడింది. ప్రముఖ వ్యాపారవేత్త మనవరాలు శ్రియా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్.. ఆ తర్వాత మ్యారేజ్ వరకు వెళ్లనేలేదు. మొత్తంగా అక్కినేని వారికి పెళ్లిళ్లు కలిసిరావని నెటిజనాలు చర్చించుకుంటున్నారు.
Kanagana Ranaut On Samantha Naga Chaitanya Divorce Issue
