Home » Andhra Pradesh » Amit Shah Phone To Chandrababu
andhra pradesh

chandrababu : చంద్రబాబుకు అమిత్ షా ఫోన్.. ఆ స్కెచ్‌లో భాగమేనా?

Authored By
mallesh
The Telugu News | Published on: October 28, 2021, 4:40 pm
Advertisement

chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీలోని వైసీపీ నేతలు ఊపిరాడకుండా చేస్తున్నారు. ఈ మధ్య టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి తీవ్ర చర్చకు దారి తీసింది. ఇందుకు నిరసనగా చంద్రబాబు నాయుడు దీక్ష సైతం చేపట్టారు. ఇక ఇటీవలే ఆయన కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా చంద్రబాబునాయడుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఆదే సమయంలో కొన్ని మీటింగ్స్ ఉండటం వల్ల అపాయింట్‌మెంట్ ఇవ్వడం కుదరలేదని చెప్పుకొచ్చారు అమిత్ షా.

Advertisement

tdp

ఏం చెప్పాలనుకున్నారో ఫోన్‌లో చెప్పాలని అమిత్ షా.. చంద్రబాబునాయుడును కోరినట్టు, త్వరలోనే కలుసుకుందాం అంటూ అమిత్ షా చెప్పినట్టు కొన్ని వార్తలు వచ్చాయి.ఈ నెల 30 బద్వేల్ బైపోల్ జరగనుంది. ఈ ఎలక్షన్‌లో టీడీపీ బరిలో లేదు. దీంతో టీడీపీ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎంతో ట్రై చేస్తున్నాయి. టీడీపీ ఇన్ డైరెక్ట్‌గా ఎవరికి సపోర్ట్ చేస్తున్నదన్న విషయాన్ని కార్యకర్తలకు చెప్పలేదు. ఇదే టైంలో పధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూశారు. చివరకు దొరక్క తిరిగి వెనుతిరిగారు. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు ఈ విషయాన్ని అధిష్ఠానానికి వివరించినట్టు సమాచారం.

Advertisement

chandrababu : బద్వేల్ బై పోల్ కోసమే..

Chandrababu

Advertisement

పార్టీ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వనందున టీడీపీకి చెందిన ఓట్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా మరే అవకాశముందని వివరించినట్టు సమాచారం. దీంతో అమిత్‌షా చంద్రబాబునాయుడికి ఫోన్ చేసి ఢిల్లీకి వచ్చిన ఉద్దేశం గురించి మాట్లాడి తెలుసుకున్నారని టాక్. బద్దేల్ బై పోల్ మాత్రమే అమిత్‌షా చంద్రబాబుకు ఫోన్ చేసేలా చేసిందంటూ వైసీపీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ లీడర్స్ చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా ఉన్నారని, బద్వేల్ బై పోల్ తర్వాత చంద్రబాబును పట్టించుకోబోరని అంటుండటం కీలకంగా మారింది. చంద్రబాబునాయడుకు అమిత్‌షా ఫోన్ చేయడంతో టీడీపీ కార్యకర్తల్లో ఎనర్జీ వచ్చిందని, బీజేపీకే వారి ఓట్ల పడతాయని స్థానిక బీజేపీ లీడర్లు హ్యాపీగా ఉన్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి