Home » Entertainment » Balyya Never Before Look In Anil Ravipudi Direction Film
Entertainment

Anil Ravipudi : అనిల్ రావుపూడి మూవీలో బాలయ్య డిఫరెంట్ షేడ్.. నెవర్ బిఫోర్ లుక్..

Authored By
mallesh
The Telugu News | Published on: November 23, 2021, 2:40 pm
Advertisement

Anil Ravipudi : అనిల్ రావుపూడి.. ఈ పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. ఎందుకంటే ఈయన డైరెక్షన్ లో వచ్చిన ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. హిట్స్ కోసం వెయిట్ చేస్తున్న కళ్యాణ్ రామ్‌తో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో తీసిన పటాస్ సినిమా హిట్ సాధించింది. దీంతో అనిల్ రావుపూడి ఫస్ట్ మూవీతోనే తన సత్తా చూపించాడు.ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ వంటి మూవీస్ తీసి తానంటే ఏంటో నిరూపించుకున్నాడు.

Advertisement

ప్రస్తుతం ఆయన ఎఫ్2 మూవీకి సీక్వెల్ ఎఫ్3 మూవీ డైరెక్షన్ లో ఉన్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ముగియగానే నట సింహం బాలకృష్ణతో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇందులో బాలయ్యతో ఎక్కువగా కామెడీ చేయించబోతున్నాడట. మొత్తంగా ఈ మూవీలో కామెడీ ఎక్కువగా ఉంటుందంటున్నాడు అనిల్ రావుపూడి. ఇప్పటి వరకు ఏ మూవీలో బాలయ్యను చూపించని విధంగా ఇందులో చూపిచబోతున్నారట.అనిల్ రావుపూడి, బాలయ్య కామినేషన్ లో ఇప్పటికే ఒక మూవీ రావాల్సి ఉండేది. ఇందుకు రామారావుగారు అనే టైటిల్ సైతం ఫిక్స్ చేశారు.


balyya never before look in anil ravipudi direction film

Advertisement

Anil Ravipudi : ఇప్పటికే ఓ మూవీ రావాల్సింది..

ఇక కథలో మార్పులు చేయాలనుకోవడంతో దానిని అలాగే పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే బాలయ్యతో చేసే కొత్త మూవీ జూలై నుంచి పట్టాలెక్క నుందని చెప్పారు అనిల్. మరి ఇప్పటికే ఫుల్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్.. బాలయ్యతో మూవీ చేయబోతున్నారంటే ఆ మూవీపై అంచనాలు ఓ రేంజ్ ఉంటాయి.

ఇదిలా ఉండగా బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీతో పాటు ఆహాలో అన్ స్టాపబుల్ షో షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక అనిల్ రావుపూడి సైతం ఎఫ్ 3 ప్రాజెక్టులో లీనమయ్యాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వీరిద్దరి కామినేషన్‌లో వచ్చే మూవీ పట్టాలెక్కనుంది. ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎదురుచూడటం మొదలుపెట్టారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి