bhimla nayak is a young director who missed the chance to direct
Bheemla Nayak : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భీమ్లా నాయక్ పేరు మారుమోగిపోతోంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని ఫస్ట్ డే చూసెయ్యాలని తెగు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే మొదటి రోజే భీమ్లా నాయక్ రికార్డులను తిరగరాసేలాగే ఉంది. దీనితో పాటు బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఎవరు జీవితాలు ఎప్పుడు మలుపుతిరుగుతాయో తెలియదు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుల కెరీర్ సైతం ఒక్క సారిగా మారిపోతుంది.
ఒక్క సక్సెస్ అందుకుంటే చాలా ఈజీగా స్టార్ హీరోలతో మూవీ చేసే చాన్స్ కొట్టేయ్యొచ్చు. ఉప్పెన మూవీ దర్శకుడు ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడు.భీమ్లా నాయక్ మూవీ డైరెక్టర్ సాగర్ కే చంద్ర.. గతంలో రాజేంద్రప్రసాద్ తో అయ్యారే మూవీ చేశాడు. తర్వాత శ్రీవిష్ణుతో ఒకడుండేవాడు అనే మూవీ చేశాడు. ఈ రెండు మూవీస్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కానీ కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. ఈ మూవీస్‌తో త్రివిక్రమ్ ను ఆకట్టుకున్న సాగర్.. భీమ్లా నాయక్ మూవీకి డైరెక్షన్ చేసే చాన్స్ కొట్టేశాడు.
Bheemla Nayak is a young director who missed the chance to direct
మొదటగా ఆ మూవీ డైరెక్ట్ చేసేందుకు వివేక్ ఆత్రేయను సంప్రదించాడట త్రివిక్రమ్. కానీ అతడు అప్పటికే నానితో ఓ మూవీ కమిట్ అవడంతో ఈ చాన్స్ వదులుకున్నాడు. ప్రస్తుతం మంచి చాన్స్ మిస్ అయ్యానని అతడు కాస్త అప్సెట్ లో ఉన్నట్టు సమాచారం. ఇక భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి ప్రీ రిలజ్ ఫంక్షన్ ను సైతం నిర్వహించాలని భావిస్తోంది చిత్రయూనిట్. ఇందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారని టాక్.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.