Bheemla Nayak : భీమ్లా నాయక్‌ను మిస్ చేసుకున్న యంగ్ డైరెక్టర్.. కారణం మరో యంగ్ హీరోనేనట.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bheemla Nayak : భీమ్లా నాయక్‌ను మిస్ చేసుకున్న యంగ్ డైరెక్టర్.. కారణం మరో యంగ్ హీరోనేనట..

Bheemla Nayak : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భీమ్లా నాయక్ పేరు మారుమోగిపోతోంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని ఫస్ట్ డే చూసెయ్యాలని తెగు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే మొదటి రోజే భీమ్లా నాయక్ రికార్డులను తిరగరాసేలాగే ఉంది. దీనితో పాటు బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఎవరు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :19 February 2022,3:46 pm

Bheemla Nayak : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భీమ్లా నాయక్ పేరు మారుమోగిపోతోంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని ఫస్ట్ డే చూసెయ్యాలని తెగు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే మొదటి రోజే భీమ్లా నాయక్ రికార్డులను తిరగరాసేలాగే ఉంది. దీనితో పాటు బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఎవరు జీవితాలు ఎప్పుడు మలుపుతిరుగుతాయో తెలియదు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుల కెరీర్ సైతం ఒక్క సారిగా మారిపోతుంది.

ఒక్క సక్సెస్ అందుకుంటే చాలా ఈజీగా స్టార్ హీరోలతో మూవీ చేసే చాన్స్ కొట్టేయ్యొచ్చు. ఉప్పెన మూవీ దర్శకుడు ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడు.భీమ్లా నాయక్ మూవీ డైరెక్టర్ సాగర్ కే చంద్ర.. గతంలో రాజేంద్రప్రసాద్ తో అయ్యారే మూవీ చేశాడు. తర్వాత శ్రీవిష్ణుతో ఒకడుండేవాడు అనే మూవీ చేశాడు. ఈ రెండు మూవీస్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కానీ కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. ఈ మూవీస్‌తో త్రివిక్రమ్ ను ఆకట్టుకున్న సాగర్.. భీమ్లా నాయక్ మూవీకి డైరెక్షన్ చేసే చాన్స్ కొట్టేశాడు.

bhimla nayak is a young director who missed the chance to direct

Bheemla Nayak is a young director who missed the chance to direct

Bhimla Nayak : మంచి చాన్స్ మిస్సయ్యాడట..

మొదటగా ఆ మూవీ డైరెక్ట్ చేసేందుకు వివేక్ ఆత్రేయను సంప్రదించాడట త్రివిక్రమ్. కానీ అతడు అప్పటికే నానితో ఓ మూవీ కమిట్ అవడంతో ఈ చాన్స్ వదులుకున్నాడు. ప్రస్తుతం మంచి చాన్స్ మిస్ అయ్యానని అతడు కాస్త అప్సెట్ లో ఉన్నట్టు సమాచారం. ఇక భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి ప్రీ రిలజ్ ఫంక్షన్ ను సైతం నిర్వహించాలని భావిస్తోంది చిత్రయూనిట్. ఇందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారని టాక్.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది