Health Tips : ఎండ అల్లం, లవంగాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయమే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే వీటిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటిని వేర్వేరుగానే కాకుండా ఎండు అల్లం, లవంగం కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుుణుులు సూచిస్తున్నారు. అయితే ఎండు అల్లం మెత్తగా చేసి… అనేక సమస్యలలో ఉపయోగిస్తారు. ఇది కాకుండా ఆహారంలో మసాలాగా కూడా ఉపయోగిస్తుంటారు. పొడి అల్లం, లవంగం యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, బీటా వంటి వాటిని కల్గి ఉంటుంది. అయితే ఎండు అల్లం, లవంగాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు అల్లం, లవంగం కలిపి తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలి పెరగకుండా కూడా చేస్తుందట. అయితే ఎండు అల్లం శరీరంలోని కొవ్వును కరిగించి, బరువును తగ్గేలా చేస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎండు అల్లం, లవంగం ఎంతగానో పనిచేస్తుందట. క్యాప్లిసిని, కుర్కుమిన్ వంటి యాంటీ ఆక్సిండెంట్ మూలకాలు పొడి అల్లం, లవగంలో విపరీతంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే పంటి నొప్పిని తగ్గించడంలోనూ పని చేస్తుందట. లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పంటి నొప్పికి చాలా మేలు చేస్తాయి.
లవంగం, ఎండు అల్లం తీసుకోవడం వల్ల పంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు, ఎండు అల్లం డికాషన్ తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండు అల్లం, లవంగం, తేనె కలిపి తినడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అంతే కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు అల్లంలోని జింజరాల్ అత్యుత్తమ ఔషధం అంట. అంతే కాదండోయ్ అల్లంలోని వేడికి బాగా చెమట పట్టడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్ లన్నీ పోతాయట. దీని వల్ల శరీరం మీద చేరిన వైరస్, బ్యాక్టీరియాలను నాశనం చేసే డెర్మిసిడిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తినీ ఇది పెంచుతుందట.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.