chandrababu
Chandrababu : ఏపీలో రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని మార్పులు కనబడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మిగిలే ఉన్నా అధికార పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతుండటంతో మేమేం తక్కువ తినలేదని చంద్రబాబు కూడా తెలుగు తమ్ముళ్లను అలర్ట్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్ నేతలు చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని చూస్తుంటే బాబు వారికి నేరుగా చెక్ పెడుతున్నట్టు తెలిసింది.వచ్చే ఎన్నికల్లో ఎవరైనా సీనియర్ నాయకులు పోటీ చేయం అని చెబితే వారి ఇక బ్రతిమిలాడేది లేదని చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
chandrababu
ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారట. కానీ, తాను పార్టీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే, కేశినేని నాని చంద్రబాబును బెదించడానికి ఇలా అన్నారా..? లేక లొందీసుకోవడానికి అన్నారా.. తెలీదు కానీ, నాని ప్రతిపాదనకు బాబు మారుమాట చెప్పకుండా ఓకే అనేసారట. అంతేకాకుండా, విజయవాడ ఎంపీ స్థానానికి చాలా మంది అభ్యర్థులు ఉన్నారని సంకేతం కూడా ఇచ్చారని తెలిసింది.కేశినేని నాని పోటీచేయబోనని చెప్పినంత మాత్రనా అతని వెంట పడి తిరిగి బ్రతిమిలాడుకోవాల్సిన పని లేదని, అలా చేస్తే అతని లాగే మరికొంత మంది తయారవుతారని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాకుండా, వచ్చే ఎన్నికలలో నిధులు ఇవ్వాలని బాబును బలవంతం పెట్టే అవకాశం లేకపోలేదు.
tdp
అందుకే మారుమాట చెప్పకుండా ఓకే అనేసారట. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీచేయాలని రాయబారం కోసం బాబు ఎవరినీ నాని వద్దకు పంపలేదని తెలిసింది.అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయకూడదని భావిస్తే ముందే చెప్పాలని తెలుగు తమ్ముళ్లకు సంకేతాలు కూడా ఇచ్చారట టీడీపీ అధినేత. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఇదివరకే మాజీ ఎంపీ మురళి మోహన్, జేసీ దివాకర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి లాంటి సీనియర్ నేతలు రాజకీయాల నుంచి వైదొలుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాంటి వారిని కూడా ఇకపై ఎవరూ సంప్రదించాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెగేసి చెప్పినట్లు టాక్. ఏదేమైనా కేశినేని నాని వ్యవహారంతో చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
This website uses cookies.