Chandrababu : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చంద్రబాబుకు తెగేసి చెప్పిన సీనియర్ నేత? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చంద్రబాబుకు తెగేసి చెప్పిన సీనియర్ నేత?

 Authored By mallesh | The Telugu News | Updated on :16 October 2021,3:10 pm

Chandrababu : ఏపీలో రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని మార్పులు కనబడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మిగిలే ఉన్నా అధికార పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతుండటంతో మేమేం తక్కువ తినలేదని చంద్రబాబు కూడా తెలుగు తమ్ముళ్లను అలర్ట్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్ నేతలు చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని చూస్తుంటే బాబు వారికి నేరుగా చెక్ పెడుతున్నట్టు తెలిసింది.వచ్చే ఎన్నికల్లో ఎవరైనా సీనియర్ నాయకులు పోటీ చేయం అని చెబితే వారి ఇక బ్రతిమిలాడేది లేదని చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

chandrababu

chandrababu

ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారట. కానీ, తాను పార్టీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే, కేశినేని నాని చంద్రబాబును బెదించడానికి ఇలా అన్నారా..? లేక లొందీసుకోవడానికి అన్నారా.. తెలీదు కానీ, నాని ప్రతిపాదనకు బాబు మారుమాట చెప్పకుండా ఓకే అనేసారట. అంతేకాకుండా, విజయవాడ ఎంపీ స్థానానికి చాలా మంది అభ్యర్థులు ఉన్నారని సంకేతం కూడా ఇచ్చారని తెలిసింది.కేశినేని నాని పోటీచేయబోనని చెప్పినంత మాత్రనా అతని వెంట పడి తిరిగి బ్రతిమిలాడుకోవాల్సిన పని లేదని, అలా చేస్తే అతని లాగే మరికొంత మంది తయారవుతారని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాకుండా, వచ్చే ఎన్నికలలో నిధులు ఇవ్వాలని బాబును బలవంతం పెట్టే అవకాశం లేకపోలేదు.

Chandrababu : ఎవ్వరినీ బ్రతిమిలాడేది లేదు.. ఉన్నవారే మాకు బలం

tdp

tdp

అందుకే మారుమాట చెప్పకుండా ఓకే అనేసారట. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీచేయాలని రాయబారం కోసం బాబు ఎవరినీ నాని వద్దకు పంపలేదని తెలిసింది.అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయకూడదని భావిస్తే ముందే చెప్పాలని తెలుగు తమ్ముళ్లకు సంకేతాలు కూడా ఇచ్చారట టీడీపీ అధినేత. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఇదివరకే మాజీ ఎంపీ మురళి మోహన్, జేసీ దివాకర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి లాంటి సీనియర్ నేతలు రాజకీయాల నుంచి వైదొలుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాంటి వారిని కూడా ఇకపై ఎవరూ సంప్రదించాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెగేసి చెప్పినట్లు టాక్‌. ఏదేమైనా కేశినేని నాని వ్యవహారంతో చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది