Home » Entertainment » Mahesh Babu Sarkaru Vari Pata Film Release Date Announced By Makers
Entertainment

Mahesh Babu : అఫీషియల్.. మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Authored By
praveen T
The Telugu News | Updated on: November 3, 2021, 4:37 pm
Advertisement

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు మేకర్స్. దాంతో సూపర్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సందర్భంగా విషెస్ తెలుపుతూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Advertisement

Mahesh Babu : థియేటర్స్‌లో సందడే సందడి..

వచ్చే ఏడాది ఏప్రిల్ 1న ప్రపంచ వ్యాప్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్‌లో మహేశ్‌బాబు బ్యాంకర్‌గా కనిపించనున్నారు. మహేశ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Advertisement

ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి