Naga Chaitanya : డైవోర్స్ తర్వాత నాగచైతన్య షాకింగ్ డెసిషన్.. కొనసాగుతున్న ఆ పనులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naga Chaitanya : డైవోర్స్ తర్వాత నాగచైతన్య షాకింగ్ డెసిషన్.. కొనసాగుతున్న ఆ పనులు..!

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. కాగా వారి విడాకులపై బోలెడన్ని వార్తలొచ్చాయి. కొందరు సమంత నిర్ణయాన్ని తప్పుబడుతూ నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు. కాగా, తాజాగా నాగచైతన్య ఎక్కడుంటున్నాడు? ఆయన నివాసం ఏది ? అనే విషయమై నెట్టింట న్యూస్ వైరల్ అవుతున్నాయి.నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ముంబై వెళ్లిపోతున్నదనే వార్తలు ప్రచారమయ్యాయి. కానీ, తాను హైదరాబాద్‌లోనే ఉంటానని సమంత చెప్పింది. కాగా నాగచైతన్య ఎలాగూ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :13 October 2021,9:20 pm

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. కాగా వారి విడాకులపై బోలెడన్ని వార్తలొచ్చాయి. కొందరు సమంత నిర్ణయాన్ని తప్పుబడుతూ నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు. కాగా, తాజాగా నాగచైతన్య ఎక్కడుంటున్నాడు? ఆయన నివాసం ఏది ? అనే విషయమై నెట్టింట న్యూస్ వైరల్ అవుతున్నాయి.నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ముంబై వెళ్లిపోతున్నదనే వార్తలు ప్రచారమయ్యాయి. కానీ, తాను హైదరాబాద్‌లోనే ఉంటానని సమంత చెప్పింది. కాగా నాగచైతన్య ఎలాగూ హైదరాబాద్‌లోనే ఉంటారు.

naga chaitanya Divorce after Key decision

naga chaitanya Divorce after Key decision

కానీ ఆయన ఎక్కడుంటారు? అనేది చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని, గచ్చిబౌలిలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారని, అక్కడి నుంచే శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ షూటింగ్‌కు వచ్చారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలో నిజమేంత అనేది తెలియాల్సి ఉంది. కాగా గతేడాది నాగచైతన్య, సమంత వారి కోసం జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారని తెలుస్తోంది. ప్రజెంట్ ఆ ఇంటికి సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Naga Chaitanya : ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ షూటింగ్‌కు అక్కడి నుంచే..!

naga chaitanya Divorce after Key decision

naga chaitanya Divorce after Key decision

ఇంటీరియర్ వర్క్స్‌తో పాటు రూమ్స్ కన్‌స్ట్రక్షన్, గార్డెన్ ఇతర పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కావడానికి ఇంకా ఏడాది టైం పడుతుందట. ఈ నేపథ్యంలోనే అదే అపార్ట్‌మెంట్‌లో నాగచైతన్య మరో ఇల్లు కొనుగోలు చేశారట. అందులోనే ఉంటూ కొత్త ఇల్లుకు సంబంధించిన పనులు దగ్గరుండి చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజమెంత అనేది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే కాని తెలియదు. ఇకపోతే నాగచైతన్య ప్రజెంట్ ‘లవ్ స్టోరి’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో తండ్రి నాగార్జునతో కలిసి చేయబోయే ‘బంగార్రాజు’ సినిమ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఇకపోతే సమంత సైతం పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ‘కాతు వాకులా రెండు కాదల్’ చిత్రాలను పూర్తి చేసింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది