ACB review Case : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఎవరికి మూడుతుందో అని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నది జగన్ ప్రభుత్వమే కావున తమ పార్టీ వారిపై అయితే దాడులు చేయాలని సీఎం ఎలాగూ ఆదేశించలేరు.
జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షం వారికి మూడిందా అంటే ప్రత్యక్షంగా కాకపోయినా ప్రజల ముందు దోషులుగా నిలపడానికి ముఖ్యమంత్రి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అదేలా అంటే గతంలో అధికారులు, ఉద్యోగులపై పెట్టిన ఏసీబీ కేసులను పున పరిశీలనకు ఒక హైపర్ కమిటీ ఏర్పాటు చేశారు.ఏసీబీ కేసులు అనేవి ఎక్కువగా అవినీతి జరిగినప్పుడు నమోదు చేస్తారు. అధికారులు, ఉద్యోగులు లంచం తీసుకుంటున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ బృందాలు దాడులు జరిపి వారిపై కేసులు నమోదు చేస్తాయి.
అయితే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్‌కు మద్దతు ఇస్తున్నారనే నెపంతో చాలా మందిపై అక్రమంగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్టు జగన్ గుర్తించారు. దీంతో ఉద్యోగులు,అధికారుల సర్వీసులకు చిక్కులు ఏర్పడ్డాయి.తాజాగా వారికి విముక్తి కల్పించేందుకు జగన్ సుముఖంగా ఉన్నారట.. ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీలో హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, పరిశ్రమల శాఖ చీఫ్ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, పబ్లిక్ సర్వీసెస్ సెక్రటరీలు సభ్యులుగా ఉన్నారు. వీరు టీడీపీ హయాంలో నమోదైన ఏసీబీ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి.. అక్రమంగా నమోదైన కేసులను గుర్తించనున్నారు. ఈ నిర్ణయంతో ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, అవినీతి అధికారులకు కాపాడేందుకు జగన్ సర్కార్ కృషి చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
Papaya Leaf Juice : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా…
Kichcha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మీడియాకు లెఫ్ రైట్ ఇచ్చాడు. ఆయన నటించిన మ్యాక్స్…
Good News : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒంటరి బాలికల కోసం మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్…
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆ సినిమా చుట్టూ…
Smart Watches : ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా ఉండాలని స్మార్ట్ వాచ్ ని పెట్టుకొని స్టైల్…
Allu Arjun : ఓ పక్క పుష్ప 2 వసూళ్లతో సరికొత్త సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోపక్క అల్లు…
This website uses cookies.