ACB review Case : సీఎం జగన్ సంచలన నిర్ణయం.. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ACB review Case : సీఎం జగన్ సంచలన నిర్ణయం.. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు

ACB review Case : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఎవరికి మూడుతుందో అని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నది జగన్ ప్రభుత్వమే కావున తమ పార్టీ వారిపై అయితే దాడులు చేయాలని సీఎం ఎలాగూ ఆదేశించలేరు. ACB review Case : ప్రభుత్వ ఉద్యోగులే కీలకం.. జగన్ తీసుకున్న నిర్ణయంతో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :30 September 2022,7:30 pm

ACB review Case : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఎవరికి మూడుతుందో అని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నది జగన్ ప్రభుత్వమే కావున తమ పార్టీ వారిపై అయితే దాడులు చేయాలని సీఎం ఎలాగూ ఆదేశించలేరు.

ACB review Case : ప్రభుత్వ ఉద్యోగులే కీలకం..

జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షం వారికి మూడిందా అంటే ప్రత్యక్షంగా కాకపోయినా ప్రజల ముందు దోషులుగా నిలపడానికి ముఖ్యమంత్రి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అదేలా అంటే గతంలో అధికారులు, ఉద్యోగులపై పెట్టిన ఏసీబీ కేసులను పున పరిశీలనకు ఒక హైపర్ కమిటీ ఏర్పాటు చేశారు.ఏసీబీ కేసులు అనేవి ఎక్కువగా అవినీతి జరిగినప్పుడు నమోదు చేస్తారు. అధికారులు, ఉద్యోగులు లంచం తీసుకుంటున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ బృందాలు దాడులు జరిపి వారిపై కేసులు నమోదు చేస్తాయి.

sensational decision of cm jagan acb officials who entered the field

sensational decision of cm jagan acb officials who entered the field

అయితే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్‌కు మద్దతు ఇస్తున్నారనే నెపంతో చాలా మందిపై అక్రమంగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్టు జగన్ గుర్తించారు. దీంతో ఉద్యోగులు,అధికారుల సర్వీసులకు చిక్కులు ఏర్పడ్డాయి.తాజాగా వారికి విముక్తి కల్పించేందుకు జగన్ సుముఖంగా ఉన్నారట.. ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీలో హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, పరిశ్రమల శాఖ చీఫ్ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, పబ్లిక్ సర్వీసెస్ సెక్రటరీలు సభ్యులుగా ఉన్నారు. వీరు టీడీపీ హయాంలో నమోదైన ఏసీబీ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి.. అక్రమంగా నమోదైన కేసులను గుర్తించనున్నారు. ఈ నిర్ణయంతో ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, అవినీతి అధికారులకు కాపాడేందుకు జగన్ సర్కార్ కృషి చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది