Ysrcp
YSRCP : పారిశ్రామికవేత్త ఎస్‌పివై రెడ్డి గురించి తెలియని వారు ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నందిపైపులను కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేయడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్‌పివై రెడ్డి. పైపులరెడ్డిగానే ఎస్‌పివై రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడని చెప్పొచ్చు. ఒక రూపాయికే భోజనం అందించి పేద ప్రజల కడుపు నింపాడు. ఈ క్రమంలోనే ఎస్‌పివై రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, వైసీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌పివై రెడ్డి నంద్యాల లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో స్థానం పొందారు. వైసీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచిన అనంతరం కొద్ది రోజులకు ఎస్‌పివై రెడ్డి టీడీపీలో చేరారు.
ysrcp
నంద్యాల ఎంపీగా ఉన్న సమయంలో టీడీపీలో చేరిన ఎస్‌పివై రెడ్డి.. తర్వాత కాలంలో నంద్యాల అభివృద్ధికిగాను పలు కార్యక్రమాలు చేపట్టారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే, ఎస్‌పివై రెడ్డి ఆరోగ్యం క్షీణించగా , కొద్ది కాలం పాటు ఆయన రెస్ట్ తీసుకున్నారు. తన అల్లుడికి నంద్యాల అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఎస్‌పివై రెడ్డి అడిగారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇకపోతే 2019 ఎన్నికల సమయంలో ఎస్‌పివై రెడ్డి పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరి, వీల్ చెయిర్‌లోనే క్యాంపెయిన్ చేశారు. అనంతరం ఆయన చనిపోయారు. ఇక ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్నారనేది బయటకు తెలియరాలేదు. కాగా ఎస్‌పివై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి జనసేనలో ఉంటారని కొందరు భావించారు.
Kurnool Politics
కానీ, ఆయన అధికార వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పడు ఎస్‌పివై రెడ్డి వైసీపీలో ఉన్నారు కాబట్టి తాను ఆ పార్టీలోకి వెళ్తే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయన అంచనా వేసుకున్నట్లు సమచారం. ఒకవేళ ఎన్నికల్లో టికెట్ లభించకపోయినా, పోటీ చేయకపోయినా తాను వైసీపీలో ఉండటమే సమంజసమని ఆయన అనుకుంటున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన వైసీపీలోకి వెళ్తారని స్థానికంగా ప్రచారం కూడా జరుగుతున్నది. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
This website uses cookies.