Jr NTR will compaign Again for tdp
JR NTR : ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ TDP నేడు విభజిత ఏపీలో ప్రతిపక్షంగా ఉంది. ఇక తెలంగాణలో టీడీపీ TDP కి కేడర్ కూడా దాదాపుగా లేకుండా పోయింది. నేతలందరూ ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకుగాను జూనియర్ ఎన్టీఆర్ JR NTR ను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం.వచ్చే ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో మాదిరిగా టీడీపీ ఓటమి పాలయితే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు, మనుగడ ప్రశ్నార్థకంగా మారే చాన్సెస్ ఉంటాయి. ఈ నేఫథ్యంలోనే పార్టీకి ఎన్నికల్లో గెలుపు అనేది అతి ముఖ్యం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ తరఫున ప్రచారానికి బరిలో దింపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని వినికిడి.
Jr NTR will compaign Again for tdp
అయితే, జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో టీడీపీకి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే చాలా బిజీగా ఉన్నారు. అయితే, తన తాత స్థాపించిన టీడీపీపైన జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్రేమ ఉన్నట్లు చాలా సార్లు తారక్ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే పార్టీ అవసరం మేరకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరఫున ప్రచారంలోకి వస్తారని పలువురు అనుకుంటున్నారు. అయితే, చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్‌ను మీడియా వారు రాజకీయాల్లోకి రావాలని ప్రశ్నించినప్పుడు ఇది టైం కాదని తప్పించుకుంటుండటం మనం చూడొచ్చు. అయితే, అవసరమైనపుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం వస్తారనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు జూనియర్‌ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలనుకుంటున్నారని సమచారం.
Chandrababu
చాలా సార్లు చంద్రబాబు chandrababu Naidu ఎక్కడికి వెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ రావాలని పలువురు ప్లకార్డులు ప్రదర్శించడం కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారంలోకి దింపేందుకుగాను చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కొంత మంది పారిశ్రామికవేత్తలను, సీనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ప్రముఖులను, టీడీపీ నేతలను తారక్ వద్దకు పంపిస్తున్నారట. చూడాలి మరి.. తారక్ రాజకీయ ప్రచారానికి అంగీకరిస్తారో.. లేదో..
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
This website uses cookies.