YSRCP : కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం.. ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YSRCP : కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం.. ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయింది..!

YSRCP : పారిశ్రామిక‌వేత్త ఎస్‌పి‌వై రెడ్డి గురించి తెలియని వారు ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నందిపైపులను కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేయడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్‌పి‌వై రెడ్డి. పైపులరెడ్డిగానే ఎస్‌పి‌వై రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడని చెప్పొచ్చు. ఒక రూపాయికే భోజనం అందించి పేద ప్రజల కడుపు నింపాడు. ఈ క్రమంలోనే ఎస్‌పి‌వై రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, వైసీపీ నుంచి పోటీ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :19 October 2021,4:45 pm

YSRCP : పారిశ్రామిక‌వేత్త ఎస్‌పి‌వై రెడ్డి గురించి తెలియని వారు ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నందిపైపులను కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేయడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్‌పి‌వై రెడ్డి. పైపులరెడ్డిగానే ఎస్‌పి‌వై రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడని చెప్పొచ్చు. ఒక రూపాయికే భోజనం అందించి పేద ప్రజల కడుపు నింపాడు. ఈ క్రమంలోనే ఎస్‌పి‌వై రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, వైసీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌పి‌వై రెడ్డి నంద్యాల లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో స్థానం పొందారు. వైసీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచిన అనంతరం కొద్ది రోజులకు ఎస్‌పి‌వై రెడ్డి టీడీపీలో చేరారు.

ysrcp

ysrcp

నంద్యాల ఎంపీగా ఉన్న సమయంలో టీడీపీలో చేరిన ఎస్‌పివై రెడ్డి.. తర్వాత కాలంలో నంద్యాల అభివృద్ధికిగాను పలు కార్యక్రమాలు చేపట్టారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే, ఎస్‌పివై రెడ్డి ఆరోగ్యం క్షీణించగా , కొద్ది కాలం పాటు ఆయన రెస్ట్ తీసుకున్నారు. తన అల్లుడికి నంద్యాల అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఎస్‌పివై రెడ్డి అడిగారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇకపోతే 2019 ఎన్నికల సమయంలో ఎస్‌పివై రెడ్డి పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరి, వీల్ చెయిర్‌లోనే క్యాంపెయిన్ చేశారు. అనంతరం ఆయన చనిపోయారు. ఇక ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్నారనేది బయటకు తెలియరాలేదు. కాగా ఎస్‌పివై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి జనసేనలో ఉంటారని కొందరు భావించారు.

YSRCP : అభివృద్ధి ప్రదాత ఎస్‌పివై రెడ్డి…

Kurnool Politics

Kurnool Politics

కానీ, ఆయన అధికార వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పడు ఎస్‌పివై రెడ్డి వైసీపీలో ఉన్నారు కాబట్టి తాను ఆ పార్టీలోకి వెళ్తే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయన అంచనా వేసుకున్నట్లు సమచారం. ఒకవేళ ఎన్నికల్లో టికెట్ లభించకపోయినా, పోటీ చేయకపోయినా తాను వైసీపీలో ఉండటమే సమంజసమని ఆయన అనుకుంటున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన వైసీపీలోకి వెళ్తారని స్థానికంగా ప్రచారం కూడా జరుగుతున్నది. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది