Home » Entertainment » Trolls On Aadi And Roja Performance In Atto Attamma Kuthuro
Entertainment

ఇంతకంటే దారుణం ఉంటుందా?.. హైపర్ ఆదితో రోజా చిందులు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 12, 2021, 11:59 pm
Advertisement

మామూలుగా ఈటీవీలో ఈవెంట్లంటే అందులో రోజా ఉండాల్సిందే. రోజాకు ఓ స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. అందులో ఆమె డ్యాన్సులతో ఇరగ్గొట్టాల్సిందే. అయితే ఇంతకుముందు మాత్రం ఆమెతో పాటు శేఖర్ మాస్టర్ కూడా ఉండి తీరాల్సిందే. కొన్ని రోజు ఈ ఇద్దరి కెమిస్ట్రీని చూడలేక జనాలు తలలు పట్టుకున్నారు. వయసు ముదిరిని కెమిస్ట్రీపై నెటిజన్లు పెదవి విరవడంతో ఆ కాంబోకు తెరదించేశారు.

Advertisement

Trolls on Aadi And Roja Performance In Atto Attamma Kuthuro

గత కొన్ని ఈవెంట్లలో ఈ ఇద్దరికి స్పెషల్ సాంగ్స్ పెట్టడం లేదు. అక్కడి వరకు జనాలకు కాస్త ప్రశాంతంగానే అనిపించింది. కానీ తాజాగా అంతకు మించి భయానకమైన పర్ఫామెన్స్‌తో అందరినీ బెదరగొట్టేశారు రోజా హైపర్ ఆది. సంక్రాంతి సందర్భంగా అత్తో అత్తమ్మ కూతురో అనే ఈవెంట్ రాబోతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే తెగ వైరల్అవుతున్నాయి.

Advertisement

అయితే తాజాగా విడుదల చేసిన ఓ ప్రోమో మాత్రం అందరినీ భయపెట్టేలానే ఉంది. అసలే డ్యాన్సులు అంతంత మాత్రంగానే వచ్చిన ఆదితో అత్తో అత్తమ్మ కూతురో అనే పాటు రోజా,అనసూయ కలిసి స్టెప్పులు వేశారు. ఇక రోజా తన స్థాయిని తగ్గించుకుని ఇలాస్టెప్పులు వేయడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటప్పుడు కూడా ఈ చిందులు ఎందుకని ట్రోల్ చేస్తున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి