KCR : కేసీఆర్ కు ఎంత వ్యతిరేకత ఉంటే.. అంత ఓట్లు ఎక్కువ వ‌స్తాయ‌ట‌.. ఈ లాజిక్ ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : కేసీఆర్ కు ఎంత వ్యతిరేకత ఉంటే.. అంత ఓట్లు ఎక్కువ వ‌స్తాయ‌ట‌.. ఈ లాజిక్ ఏంటి..?

 Authored By mallesh | The Telugu News | Updated on :21 October 2021,7:00 am

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఆయన లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడని ఇటీవల పలు సర్వేలు తెలిపాయి. ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్, సీ ఓటర్ సర్వే ప్రకారంగా.. దాదాపు 30.3 పర్సంటేజ్ ప్రజానీకం కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. అయితే, కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయను ఆమోదించే వారి శాతం కూడా అంత కంటే ఎక్కువ ఉంటుందని గులాబీ పార్టీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.గతంలో కూడా చాలా మంది టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ఆదరణ తగ్గిందని చెప్పారని, కానీ, తమ పార్టీ ఫస్ట్ టర్మ్ కంటే సెకండ్ టర్మ్‌లో ఎక్కువ సీట్లు గెలుచుకుందని పింక్ పార్టీ నేతలు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేదన్న విషయం అందరికీ విదితమే.

kcr

kcr

ఇప్పుడిప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలపడే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, నిజంగా బలమైన ప్రతిపక్షం లేదని, అదే టీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసొస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇకపోతే కేసీఆర్ వర్కింగ్ స్టైల్ మిగతా అందరికంటే భిన్నంగా ఉంటుందని, ప్రజలకు చేరువవడంలో ఆయనది అందరి కంటే భిన్నమైన శైలి అని రాజకీయ పరిశీలకులు అంటుంటారు. టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు వినూత్నంగా చేపట్టేందుకుగాను, ప్రచార సరళిలోనూ అన్నిటా భిన్నమైన వ్యవహారం కేసీఆర్ చేస్తారని అంటున్నారు. ఇకపోతే కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇతరాలు అన్ని కూడా ప్రజలకు చేరువయ్యాయని, కాబట్టి తమకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులుండబోవని టీఆర్ఎస్ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

KCR : బలమైన ప్రతిపక్షం లేకపోవడమే టీఆర్ఎస్‌కు బలం..

టీఆర్ఎస్ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఎన్ని సర్వేలు చెప్పనప్పటికీ కేసీఆర్ మంత్రమే టీఆర్ఎస్‌ను రాజకీయంగా అధికారంలో ఉంచుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ అవి బలపడి ఓట్లు చీల్చడం, అధికారంలోకి రావడం అంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు కొందరు అంచనా వేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది