Home » National » Viral Video Man Fell Under The Tractor Saved Helmet
National

Viral Video : ట్రాక్ట‌ర్ కింద ప‌డ్డ వ్య‌క్తి.. ప్రాణాల‌ను నిల‌బెట్టిన హెల్మెట్‌.. వీడియో !

Authored By
praveen T
The Telugu News | Published on: September 19, 2021, 9:50 pm
Advertisement

హెల్మెట్ పెట్టుకుంటే ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డొచ్చ‌ని అంద‌రికీ తెలిసిందే. కానీ కొంద‌రు మాత్రం హెల్మెట్ పెట్టుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇక‌పోతే హెల్మెట్ వ‌ల్ల చాలామంది ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ సంఘ‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక‌పోతే ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది.

Advertisement

Viral Video man fell under the tractor saved helmet

గుజరాత్‌లోని దహోద్ నగరంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి హెల్మెట్ ఉండ‌టం వ‌ల్ల ప్రాణాల‌ను కాపాడుకోగ‌లిగాడు. ఇప్పుడు అక్కడ‌ వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో రోడ్ల‌న్నీ నీటితో నిండిపోతున్నాయి. కాగా ఆ వ్య‌క్తి బైక్‌పై వెళ్తుండ‌గా మ‌ద్య‌లో వ‌చ్చిన గుంతను తప్పించడానికి ప్రయత్నిస్తుండగా రోడ్డుపై అనుకోకుండా పడిపోయాడు.ఇక ఆ బైక్ పై ఓ మహిళ అలాగే మ‌రో చిన్నారి కూడా ఉన్నాడు. ఇక ఇలా వీరు బైక్ మీద నుంచి ప‌డుతున్న స‌మ‌యంలోనే ట్రాక్టర్ ట్రాలీ అటు నుంచి వెళుతోంది. ఇక బైక్ జారి కిండ పడగానే, ఆ యువకుడు ట్రాలీ కిందకు పడిపోవ‌డం సంచ‌ల‌నం రేపింది.

Advertisement

 

Advertisement

అయితే ట్రాలీ టైర్ కూడా అతని తలపై నుంచి వెళ్డంతో అంతా అత‌ను చ‌నిపోయాడ‌ని అనుకున్నారుఉ. కానీ ఆ వ్య‌క్తి హెల్మెట్ పెట్టుకోవ‌డం వ‌ల్ల ప్రమాదం నుంచి బ‌య‌ట ప‌డ్డాడు. లేదంటే ఎంత ఘోరం జరిగుండేదో అని అనిపిస్తోంది. ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి