Revanth Reddy : కేసీఆర్‌కు ఇదే మంచి చాన్స్‌.. రేవంత్‌రెడ్డి అక్క‌డ దొరికిపోతాడా..?

Revanth Reddy : టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. అయితే, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రేవంత్ నాయకత్వాన్ని బలపరిచినప్పటికీ ఆ పార్టీలో ఉన్న సీనియర్లు మాత్రం రేవంత్‌ను సపోర్ట్ చేసేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే వారి మద్దతు కోసం రేవంత్ వారిని సంప్రదించి వారిని ఒప్పించి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే ‘దళిత, గిరిజన ఆదివాసీ’ దండోరా సభలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన రేవంత్ .. త్వరలో నిరుద్యోగుల పక్షాన పోరు జరపనున్నారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా నియామకం అయిన తర్వాత పార్టీలో సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి.

Revanth Reddy resigns as MP Super plan to hit KCR

రేవంత్ ఏక పక్షనిర్ణయాలు తీసుకుంటున్నారని, సమిష్టి నిర్ణయాలతోనే పార్టీ నడుస్తుందని రేవంత్ పట్ల సీనియర్ నేతలు కొందరు బహిరంగంగానే రేవంత్‌ను హెచ్చరించారు. అయితే, సీనియర్లను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకుపోవాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయమై ఇన్ని రోజుల పాటు తాత్సారం చేసి చివరకు విద్యార్థి నాయకులు బి.వెంకట్‌ను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ బై పోల్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేవంత్‌కు మద్దతు పలుకుతారా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచి ప్రచారంలో దూసుకెళ్తారా? లేదా చూడాలి మరి.. అయితే, పార్టీ సీనియర్ నేతలు హుజురాబాద్ ఉప ఎన్నికలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దాని బాధ్యత మొత్తంగా రేవంత్‌పైనే పడాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

kcr

Revanth Reddy : రేవంత్ ఒంటరిగానే.. హుజురాబాద్ ప్రచారంలో..

అందుకే రేవంత్‌కు హుజురాబాద్ బై పోల్ సవాల్‌గా మారనుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ప్రచార పర్వంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ‘ప్రజా దీవనె యాత్ర’ పేరిట పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రజలతో మమేకమై తనను గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు, స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈటల తరఫున ఆల్రెడీ ప్రచారం నిర్వహించారు.

Recent Posts

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

15 minutes ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

2 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

4 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

6 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

8 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

9 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

10 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

11 hours ago