Anchor Rashmi : సుధీర్ ఫ్యాన్స్ కు గుండె పగిలిపోయే న్యూస్.. కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ .. !! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Anchor Rashmi : సుధీర్ ఫ్యాన్స్ కు గుండె పగిలిపోయే న్యూస్.. కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ .. !!

Anchor Rashmi : బుల్లితెరపై యాంకర్ రష్మీ సుదీర్ఘకాలంగా సందడి చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. యాంకరింగ్ కంటే ముందుగా రష్మీ టాలీవుడ్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా నటించారు. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఆ సమయంలోనే జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటినుంచి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. తన యాంకరింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఈ షో తోనే […]

 Authored By anusha | The Telugu News | Updated on :30 December 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Anchor Rashmi : సుధీర్ ఫ్యాన్స్ కు గుండె పగిలిపోయే న్యూస్.. కాబోయే భర్తను పరిచయం చేసిన రష్మీ .. !!

  •  బుల్లితెరపై యాంకర్ రష్మీ సుదీర్ఘకాలంగా సందడి చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. యాంకరింగ్ కంటే ముందుగా రష్మీ టాలీవుడ్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా నటించారు.

Anchor Rashmi : బుల్లితెరపై యాంకర్ రష్మీ సుదీర్ఘకాలంగా సందడి చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. యాంకరింగ్ కంటే ముందుగా రష్మీ టాలీవుడ్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా నటించారు. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఆ సమయంలోనే జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటినుంచి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. తన యాంకరింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఈ షో తోనే రష్మి – సుధీర్ జోడీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ పాపులారిటీతోనే రష్మీ సినిమా ఆఫర్లను పట్టేసింది. ఇకపోతే సోషల్ మీడియాలో తన పెళ్లి వార్తలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సుధీర్ , రష్మీ లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గతంలో చాలా సార్లు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ రూమర్లే అని తేలింది.

అయితే తాజాగా న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్లో రష్మి తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీ ‘ రష్మీ పెళ్లి పార్టీ ‘ అనే పేరుతో స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇక ఈవెంట్ ఎప్పటిలాగే చాలా హుషారుగా సాగింది. డాన్స్ మాస్టర్ పండు ముగ్గురు ముద్దుగుమ్మలతో చేసిన హాట్ పెర్ఫార్మెన్స్ షో కి హైలైట్ గా నిలిచింది. చమ్మక్ చంద్ర, శ్రీ సత్య జోడి డాన్స్ లతో అదరగొట్టారు. ఇక కామెడీ స్కిట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే హైపర్ ఆది రష్మీని ఒక ప్రశ్న అడిగారు. ఇన్ని రోజులుగా నువ్వు టీఆర్పీ రేటింగ్స్ కోసం అన్ని చేశావు. కానీ ఇప్పుడు నిజం చెప్పు..నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు.. అతడిని మేము చూడాలనుకుంటున్నాము అని అడిగాడు.

దాని బదులుగా రష్మి.. కాబోయే భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. నాకు కూడా కాబోయే వాడు ఇలా ఉండాలని, కొన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయని చెబుతుండగానే అంతలోనే వెనకనుంచి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతడే రష్మిని పెళ్లి చేసుకోబోయే వాడు అని ప్రోమో ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అతని గురించి ఏ వివరాలు తెలియలేదు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా ఎప్పటిలాగే టిఆర్పీ స్టంట్ లో భాగమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ కుర్రాడు మాత్రం చాలా బాగున్నాడు అని, రష్మీ మంచి అబ్బాయిని పట్టింది అని కితాబు ఇస్తున్నారు. ఇది టిఆర్పీ స్టంట్ లో భాగమా లేదా నిజమా అని తెలియాలి అంటే డిసెంబర్ 31 రాత్రి 9:30 వరకు ఆగాల్సిందే. దీంతో ఈ స్పెషల్ ఈవెంట్ కోసం ఎంతోమంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది