
brahmamudi 16 november 2023 thursday full episode
Brahmamudi 16 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 16 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 255 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెళ్లానికి మొగుడే కదా సారీ చెప్పాల్సింది అంటుంది కావ్య. దీంతో అందరి ముందు నన్ను ఇంత చులకన చేస్తే నేను నీకు సారీ చెబుతా అని ఎలా అనుకున్నావు అంటాడు రాజ్. మీరు నా ప్రేమకు లొంగిపోయి, పడిపోయి అక్కడ సారీ రాశారా? అని అడుగుతుంది కావ్య. అసలు ఏంటే ఈ డ్రామా అంటే నాటకం అంటుంది కావ్య. ఏంటి అంటే నాటకం అంటుంది. అంటే.. ప్రేమ నాటకం అంటుంది కావ్య. నేను నటిస్తే ఎలా ఉంటుందో నమూనా ఈ విధంగా ఉంటుంది అని చూపించాను. నిన్నా మొన్నటి దాకా కత్తులు లేకుండానే మాటల యుద్ధం చేసుకున్నాం. చివరికి మా అక్క చేసిన పనికి నీ దృష్టిలో నేను దోషిని అయ్యాను. లోపలికి అడుగుపెట్టడమే తప్ప.. బయటికి రావడం తెలియని అభిమన్యుడిలా ఆడపిల్ల అత్తారింట్లో అడుగుపెట్టాలి. జీవితాంతం అక్కడే ఉండాలంటే ఏ సమస్య వచ్చినా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఏ గజదళంలా మీదికి వస్తారో తెలియదు. మీ అత్త లాంటి వాళ్లు దాడి చేస్తుంటే మా అక్క శత్రుపక్షంలో చేరి నాపై దాడి చేస్తుంటే నేను ఏం చేయాలి. కర్ణుడిలా ఒంటరిపోరాటం చేస్తూ ఎటునుంచి ఏ ఆయుధం గుండెల్ని చీల్చుతుందో అని ఒక ఆడపిల్ల సంసారం సాగించాలి అంటుంది కావ్య.
ఇక్కడ అడుగు పెట్టిన ఇన్ని రోజుల్లో నా కాపురం కురుక్షేత్రమే అయింది. నా కాపురం యుద్ధమే అయింది. ఈ ఇంటి కోడలుకు ఏ కవచాలు ఉండవు. సున్నితమైన హృదయం మాత్రమే ఉంటుంది. ఏ మాట పడ్డా మనసులోనే పెట్టుకుంటుంది. కన్నీళ్లు పాతాళ జలంలా అట్టడుగునే ఉండాలి. ఈ సమాజం నా జీవితాన్ని కథలు కథలుగా రాస్తుందన్న భయంతో అలాంటి అవకాశం ఇవ్వకుండా ఇక్కడే సమాధి చేసుకుంటున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. ఒక నిజం దాచాను కానీ.. అది మీ దృష్టిలో తప్పు. మీ అమ్మగారి దృష్టిలో నేరం. అందుకే ఇప్పుడు నాకు నేనే కవచం కావాలి. నాకు నేను, నా స్థానం కోసం నేను యుద్ధం మొదలుపెట్టాలి. ఇన్నేళ్లలో ఈ ఇంటి పెద్దకు పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది. అందరినీ సంతోషంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. మీతో పాటు నేనూ నటించాల్సిన అవసరం వచ్చింది. మీ ప్రమేయం లేకుండా సారీ రాసినందుకు సారీ అని చెబుతుంది కావ్య. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో రాజ్ కు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అక్కడే కూర్చుండిపోతాడు రాజ్. నన్ను ఒక్కడినే తిట్టిందా.. అందరినీ విమర్శించిందా? తన బాధ చెప్పిందా.. అసలు ఏ మాయ చేసి పోయింది అని అనుకుంటాడు రాజ్.
మరోవైపు రాహుల్ కొరియర్ కోసం ఎదురు చూస్తుంటాడు. అరుణ్ కొరియర్ కోసం ఎదురు చూస్తుంటాడు. రుద్రాణి కూడా అదే అడుగుతుంది. దీంతో చేస్తాడు మామ్.. కనుక్కుంటాను ఉండు.. అని ఫోన్ చేస్తాడు. మీరు చెప్పగానే చేసేశాను సార్.. వచ్చేస్తుంది అంటాడు. ఇంతలో కోరియర్ బాయ్ వస్తాడు. అందులో స్వప్న, అరుణ్ కలిసి దిగిన ఫోటోలు ఉంటాయి. ఎవరికి వచ్చింది కోరియర్ అని అడిగితే దుగ్గిరాల ఫ్యామిలీ అని రాసి ఉంటుంది. అదేంటి అని ఆ కవర్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది ధాన్యలక్ష్మి. ఏంటి ఆ కోరియర్ అంటే.. తెలియదు అక్క దుగ్గిరాల ఫ్యామిలీ అని రాసి ఉంది అని చెబుతుంది. ఫ్రమ్ అడ్రస్ కూడా ఉండదు.
అసలు ఏం పంపించారో చూడు అని చెబుతుంది అపర్ణ. దీంతో కిచెన్ లో ఏదో పొంగుతుంటే నువ్వే చూడు అక్క నేను స్టవ్ ఆఫ్ చేసి వస్తాను అని చెప్పి అపర్ణకు చెబుతుంది. ఇంతలో అపర్ణను ఎవరో పిలిస్తే.. ఆ కోరియర్ ను ఓపెన్ చేసి ఇంద్రాదేవి చూస్తుంది. అందులో స్వప్న, అరుణ్ కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తాయి. వాటిని చూసి ఇంద్రాదేవి షాక్ అవుతుంది.
డైరెక్ట్ గా స్వప్న దగ్గరికి వెళ్లి ఆ ఫోటోలను చూపిస్తుంది ఇంద్రాదేవి. ఎవరు ఈ అబ్బాయి అని అడుగుతుంది ఇంద్రాదేవి. నాకు ఎవరో తెలియదు అంటుంది స్వప్న. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.