Categories: NewsTV Shows

Brahmamudi 7 Nov Today Episode : సీతారామయ్యకి క్యాన్సర్ అనే విషయం ఇందిరాదేవికి తెలిసి షాక్.. స్వప్న, కావ్యను ఇంట్లో నుంచి వెళ్లగొడతారా? కావ్యకు రాజ్ విడాకులు?

Brahmamudi 7 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 7 నవంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 247 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సమావేశం అవుతారు. తాతయ్య ఇప్పుడు మీకు ఒక నిర్ణయం చెబుతారు. ఆ నిర్ణయం ఏదైనా అందరూ ఒప్పుకోవాల్సిందే అంటుంది ఇందిరాదేవి. ఈ మోసానికి పరిహారం లేదు. పరిష్కారం మాత్రమే ఉంది అదేంటో చెప్పు బావ అంటుంది. దీంతో ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటాడు సీతారామయ్య అంటాడు. ఇంతలో ఒక్క నిమిషం తాతయ్య అంటాడు రాహుల్. దీంతో ఇది ఏకపక్ష నిర్ణయం కాదు. చెప్పు అంటాడు సీతారామయ్య. నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పు అంటాడు. నేను తప్పు చేశాను. చాలా తప్పులు చేశాను. స్వప్నను ప్రేమించడం తప్పు, పెళ్లి చేసుకుంటా అని మోసం చేయడం తప్పు. ఇంత పెద్ద కుటుంబంలో నా వల్ల మచ్చ రాకూడదని స్వప్న గురించి చెప్పలేదు. అందువల్ల నేను మీ అందరి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. మారిపోయాను.. స్వప్నను ప్రేమగా చూసుకున్నాను. కానీ.. తను అదేదీ నిలబెట్టుకోలేకపోయింది. నన్నే కాదు. ఈ ఇంట్లో వాళ్లందరినీ మోసం చేసింది. అది చిన్నమోసం కాదని మీ అందరికీ తెలుసు. కేవలం పెళ్లి కోసమే అబద్ధం చెప్పి ఉంటే అనుకోవచ్చు కానీ.. దాన్ని అలాగే శీమంతం దాకా కంటిన్యూ చేసింది అని అంటాడు రాహుల్. మీరు కావ్య విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు కానీ.. నేను స్వప్నతో మాత్రం కాపురం చేయలేను. మీరు నాకు విడాకులు ఇప్పించండి తాతయ్య అంటాడు రాహుల్.

రుద్రాణి.. నీ నిర్ణయం అంతేనా అని అడుగుతాడు సీతారామయ్య. దీంతో ఇంతకన్నా మంచి నిర్ణయం ఏముంటుంది. నాకు ఈ కోడలు వద్దు. ఇప్పుడు పంపించేసి.. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ మీద విడాకులు ఇప్పించేద్దాం. అంతగా కావాలంటే భరణం కింద ఎంతో కొంత మొహాన పడేద్దాం అంటుంది రుద్రాణి. ఆ తర్వాత అపర్ణ కూడా మాట్లాడుతుంది. మనం బురదలో పడ్డాం.. ఆ మట్టి వాసన దుగ్గిరాల ఫ్యామిలీని చేరకముందే కడిగేసుకుందాం. ఇంత దూరం వచ్చాక స్వప్నతో పాటు కావ్యను కూడా పంపించేద్దాం. రాజ్ కి విడాకులు ఇప్పించేద్దాం అంటుంది అపర్ణ. అదే మంచిది. తప్పు చేయడమే తప్పు కాదు. తప్పు చేయించడం కూడా తప్పే. ఈ ఇద్దరూ ఈ వంశానికి, ఈ కుటుంబానికి కోడళ్లుగా వచ్చారు. నాకు కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటుంది కావ్య. దీంతో తన మాట ఎవ్వరూ వినరు. స్వప్న మాత్రం మిమ్మల్ని, రాహుల్ ను కోర్టుకు లాగుతా అంటుంది స్వప్న. మీకెవరు సపోర్ట్ చేసినా వాళ్లందరినీ కోర్టు బోను ఎక్కిస్తా అంటుంది స్వప్న. ఇంట్లో వచ్చిన కోడళ్లను తరిమేద్దాం అనుకుంటున్నారా? అది అంత సులువు కాదు. నేను కానీ బయటికి వెళ్లాల్సి వస్తే నేను అందరినీ బయటికి లాగుతా అంటుంది స్వప్న.

Brahmamudi 7 Nov Today Episode : రాహుల్, రుద్రాణి, స్వప్న ముగ్గురు బయటికి వెళ్లిపోండి అన్న సుభాష్

ఈ ఫ్యామిలీతో ఢీకొనడానికి నీ సత్తా సరిపోదు అంటుంది రుద్రాణి. దీంతో అదీ చూస్తాను రుద్రాణి గారు అంటుంది స్వప్న. నన్ను పేరు పెట్టి పిలుస్తావా అంటే.. మీకు ఇంకో పేరు ఉందా? మీరే కదా నేను కోడలుగా పనికిరాను అన్నారు అంటుంది స్వప్న. దీంతో ఆపండి అంటాడు సుభాష్. ఈ తప్పులో రాహుల్ కు భాగం ఉంది. ముందు వాడు మోసం చేయడం వల్లే స్వప్న ఈ అబద్ధం ఆడి పెళ్లి చేసుకుంది. కాబట్టి రాహుల్, రుద్రాణి, స్వప్న.. ముగ్గురు కలిసి బయటికి వెళ్లండి అంటాడు సుభాష్.మమ్మల్ని ఎందుకు బయటికి వెళ్లమంటున్నావు అని అడుగుతుంది రుద్రాణి. దీంతో మీరంతా బయటికి వెళ్లండి అంటాడు సుభాష్. దీంతో అలాగే వెళ్లిపోతాం. తప్పకుండా వెళ్లిపోతాం. మా ఆస్తి మాకు పంచండి అంటుంది స్వప్న. దీంతో అందరూ షాక్ అవుతారు. మీ ఆస్తా.. మీకు ఆస్తి కూడా ఉందా అని అడుగుతుంది అపర్ణ. మీ పుట్టింటి నుంచి ఎన్ని కోట్లు తెచ్చావు. రుద్రాణి కట్టుబట్టలతో పుట్టింటికి వచ్చింది. ఆ మాటకు వస్తే ఆవిడకు మా ఇల్లు పుట్టిల్లే కాదు. మా మామ గారు దయతలిచి ఆశ్రయం ఇచ్చి చదివించి పెళ్లి చేసి పంపించారు అంతే. నా భర్తకు తోడబుట్టినదే అయితే తనకు ఏం ఇవ్వాలో నా భర్త, మామయ్య కలిసి నిర్ణయిస్తారు. ఆస్తి పంచాలా.. నీ అత్తకే దిక్కులేదు. నీకేం పంచుతారు అంటుంది అపర్ణ.

దీంతో రుద్రాణికి కోపం వస్తుంది. నన్ను పెంచారు.. చదివించారు. కంటేనే కూతురా? నాకు నచ్చిన వాడికి ఇవ్వకుండా అపర్ణ వదిన వల్లనే ఎవడికో కట్టబెట్టారు అంటుంది. ఇలా.. ఒకరికి మరొకరు లొల్లి పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. దీంతో సీతారామయ్యకు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆయన్ను సోఫాలో కూర్చోబెడతారు.ఈ ఇంట్లో అందరూ నటిస్తూనే ఉన్నారు. చివరకు నువ్వు కూడా నటిస్తున్నావా నాన్న అంటుంది రుద్రాణి. దీంతో షటప్ అత్త అంటాడు రాజ్. తాతయ్య గురించి నువ్వు అలా మాట్లాడుతున్నావా? ఆస్తి పంపకాల దగ్గరికి వచ్చేసరికి నటిస్తున్నాడని అంటున్నవా? ఆయన ఆరోగ్యం గురించి నీకు తెలుసా? అసలు ఆయన ఎంత కాలం బతుకుతారో నీకు తెలుసా? అంటాడు రాజ్…

డాడ్.. ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి. ఈ నిజం దాచిపెట్టి లాభం లేదు. తాతయ్యకు క్యాన్సర్ వచ్చింది అని చెబుతాడు రాజ్. దీంతో అందరూ నోరెళ్లబెడతారు. ఇందిరాదేవి కూడా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అంటుంది ఇంద్రాదేవి. నిజం నానమ్మ. తాతయ్య మనకు దూరం అయిపోవడానికి ఇంకొన్ని రోజులు గడువు మాత్రమే ఉంది. వరలక్ష్మి వ్రతం రోజు కండ్లు తిరిగి పడిపోయినప్పుడు నేను ఆసుపత్రికి తీసుకెళ్తే ఈ నిజం బయటపడింది అంటాడు రాజ్.

నీకు ఏం కాదు బావ.. నేను కానివ్వను అంటుంది ఇందిరాదేవి. నీకు ఏం జరిగినా నేను భరించలేను బావ. ఈ ఇల్లు ముక్కలు అయిపోతుంటే మేము చూస్తూ ఊరుకోలేం. ఎవ్వరినీ ఎవ్వరు గడప దాటి వెళ్లమనడానికి వీలు లేదు అంటుంది ఇందిరాదేవి. నా మనవరాళ్లు ఇద్దరూ ఇక్కడే ఉంటారు. ఈ ఇంట్లోనే ఉంటారు. మనతోనే ఉంటారు అంటుంది ఇందిరాదేవి.

కాదని, లేదని మీ మెండితనమే ముఖ్యమని మీరు అనుకుంటే తల్లిగా, అత్తగా, ఈ పెద్దమనిషి భార్యగా నేను ఎవ్వరినీ క్షమించను. అర్థమయిందా? అని అందరినీ అడుగుతుంది. ఇంతలో తాతయ్య.. స్వప్న, కావ్యను పిలుస్తాడు. కూర్చోండి అంటాడు. మీ అమ్మమ్మ అన్నట్టు మీరు ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు అంటాడు.

రాహుల్ ఇక నుంచి నీతో ఎప్పటిలాగే ఉంటాడు సరేనా అంటాడు. తాతయ్య నేను ఎక్కడికీ వెళ్లను తాతయ్య. మీరు క్షేమంగా ఉండాలి. అదే మాకు కావాల్సింది అంటుంది స్వప్న. రాజ్.. ఇలారా అంటాడు తాతయ్య. ఇంతకాలం నీ మంచితనం, సంస్కారం అన్నీ శాసించడం వల్ల బలవంతంగా కాపురం చేస్తున్నావని నాకు అర్థం అయింది. రాజ్.. నువ్వు కావ్యను మనస్ఫూర్తిగా భార్యగా స్వీకరించాలి అంటాడు సీతారామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

8 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

9 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

10 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

11 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

12 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

13 hours ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

14 hours ago

Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…

15 hours ago