Categories: NewsTV Shows

Guppedantha Manasu 11 Dec Today Episode : తెలివిగా తప్పించుకున్న శైలేంద్ర.. రిషిని ఇరికించిన శైలేంద్ర.. ముకుల్ షాక్.. ఇంతలో అసలు ట్విస్ట్ ఏంటంటే?

Guppedantha Manasu 11 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు సీరియల్ 11 డిసెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 943 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వాయిస్ మీదా కాదా చెప్పండి శైలేంద్ర గారు అని అడుగుతాడు ముకుల్. దీంతో నాదే అని అంటాడు శైలేంద్ర. దీంతో అందరూ షాక్ అవుతారు. రేయ్.. దుర్మార్గుడా చెడ పుట్టావురా నువ్వు అంటూ రవీంద్ర.. శైలేంద్రని కొడతాడు. ఆగండి సార్ అంటాడు ముకుల్. ఒరేయ్ దుర్మార్గుడా ఎలా పుట్టావురా నా కడుపులో. తల్లి లాంటి జగతిని ఎలా పొట్టనపెట్టుకున్నావురా అని ఆవేశపడతాడు. ఛీ దరిద్రుడా అంటాడు రవీంద్ర. నేరం ఒప్పుకున్నాడు కదా. స్టేషన్ కు వస్తారా లేకపోతే తీసుకెళ్లమంటారా అంటాడు ముకుల్. దీంతో వస్తాను సార్ అంటాడు శైలేంద్ర. రండి అంటే ఒక్క నిమిషం అంటాడు శైలేంద్ర. మమ్మీ.. నా ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంది తీసుకొస్తావా అంటాడు. తీసుకొస్తాను ఉండు అంటుంది దేవయాని. ఒక్క నిమిషం సార్ అని ఆ ఫోన్ తీసుకొని ఓ వాయిస్ వినిపిస్తాడు. అది శైలేంద్ర చేసిన ఫ్యాబ్రికేటెడ్ ఆడియో. ముకుల్.. శైలేంద్రతో మాట్లాడిన ఆడియో అది. కావాలని శైలేంద్రను ఇరికించాలని ముకుల్ చేస్తున్నాడని.. నిన్ను ఈ కేసు నుంచి తప్పించేందుకు 50 లక్షలు కావాలి అని శైలేంద్రకు ముకుల్ చెప్పినట్టుగా ఆ ఆడియోలో ఉంటుంది. ఆ ఆడియోను అందరికీ వినిపిస్తాడు శైలేంద్ర.

నో సార్.. ఆ వాయిస్ నాది కాదు అంటాడు ముకుల్. అదేంటి సార్ అచ్చం మీ వాయిస్ లాగానే ఉంది కదా అంటే.. ఎవరో క్రియేట్ చేశారు అంటాడు ముకుల్. సార్ మీరు మాట్లాడినట్టే ఉంది కదా సార్ అంటే అదంతా ఫ్రాడ్. నా సర్వీస్ లో నేనెప్పుడూ లంచం తీసుకోలేదు. తీసుకోను కూడా. ఎవరో కావాలని చేశారు. ఆవాయిస్ మాత్రం నాది కాదు అంటాడు ముకుల్. అదేంటి సార్ ఇందాక మీరు వినిపించిన వాయిస్ నాది అయినప్పుడు.. ఈ వాయిస్ మీది ఎందుకు కాదు అంటాడు శైలేంద్ర. దీంతో అసలు నేను మీకు కాల్ చేయలేదు అంటాడు ముకుల్. దీంతో డీప్ ఫేక్ లాంటి టెక్నాలజీతోనే ఫేస్ మార్ఫింగ్ చేస్తున్నారు. ఒక వాయిస్ ను క్రియేట్ చేయడం పెద్ద పనేం కాదు కదా. ఒక వాయిస్ పట్టుకొని వచ్చి పేషెంట్ అని కూడా చూడకుండా అనుమానిస్తూ అడుగుతున్నారే.. ఇది మీకు కరెక్ట్ గా అనిపిస్తుందా? మా పిన్ని హత్య కేసులో నన్ను అనుమానితుడుగా చేస్తున్నారు. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తోందా అంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu 11 Dec Today Episode : నా తండ్రే నన్ను అనుమానించాడు అంటూ యాక్టింగ్ చేసిన శైలేంద్ర

నేను తల్లిలా భావించే మా పిన్ని చావుకు నేనే కారణం అనుకొని నా తండ్రే నన్ను అనుమానించాడు. నా మీద చేయి చేసుకున్నాడు. అప్పుడే నా గుండె ముక్కలు అయిపోయింది. ఏం మమ్మీ.. నా కొడుకు అలాంటి వాడు కాదు అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు. మా పిన్ని హత్య కేసులో ఎప్పుడైతే మీరంతా నన్ను అనుమానించారో అప్పుడే మీరంతా నన్ను చంపేసినట్టే. ఆయనేదో ఒక ఆధారం తీసుకొచ్చారని.. మీరంతా ఆయన మాటలు వింటూ కూర్చున్నారు. అసలు ఆ ఫోన్ నెంబర్.. సిమ్ ఎవరి పేరు మీద ఉందో మీరు కనుక్కున్నారా? చెప్పండి.. సార్ ఆ సిమ్ నా పేరు మీద ఉందా అంటే లేదు అంటాడు. కదా.. ముందు ఆ సిమ్ ఏ ఫోన్ లో వాడారు. దాని ఐఎంఈఐ నెంబర్ కూడా తెలుసుకోవాలి కదా అంటాడు.

ఆ తర్వాత ఇంకో వాయిస్ వినిపిస్తాడు శైలేంద్ర. అన్నయ్య.. ఇక నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే అన్నయ్య. నీ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. వసుధారను ఎండీ సీటులో కూర్చోబెట్టాలని అనుకున్నప్పుడు అమ్మ అడ్డుగా అనిపించింది. వెంటనే తన అడ్డు తొలగించి వసుధారను ఆ సీటులో కూర్చోబెట్టాను. కానీ.. ఫ్యూచర్ లో నీ నుంచి కూడా ఎటువంటి సమస్య కూడా రాకూడదు అంటే.. ఎలాంటి అడ్డంకి ఉండకూడదు. అందుకే నీ మీద అటాక్ చేయించాను. కానీ.. మిస్ అయిపోయింది. త్వరలోనే నిన్ను కూడా ఫినిష్ చేస్తా అని రిషి.. శైలేంద్రతో మాట్లాడినట్టుగా ఉన్న ఆడియోను వినిపిస్తాడు శైలేంద్ర. ఆ ఆడియో కాల్ విని అందరూ షాక్ అవుతారు.

ఏయ్. శైలేంద్ర తప్పు చేస్తున్నావు. రిషి మాట్లాడిన వాయిస్ కాదు. రిషి అలాంటి వాడు కాదు అంటే.. నాకు తెలుసు బాబాయి.. రిషి అలాంటి వాడు కాదు. కానీ.. మీరంతా నా వాయిస్ విని నన్ను అనుమానించడం మొదలు పెట్టారు. సొంత కొడుకు అయితే ఒక లెక్క.. అన్న కొడుకు అయితే ఇంకో లెక్కా బాబాయి చెప్పు అంటాడు శైలేంద్ర. నేను ఎప్పుడూ మిమ్మల్ని సొంత తండ్రి లాగానే చూశాను. కానీ.. మీరు మాత్రం నన్ను పరాయివాడిలా, శత్రువులా చూశారు. నాకు అర్థం అవుతోంది అంటాడు శైలేంద్ర. ఇంతలో తనకు మళ్లీ కడుపులో నొప్పి వస్తుంది. దీంతో వద్దు శైలేంద్ర.. ఆవేశపడకు అంటుంది దేవయాని.

ముకుల్ గారు.. అసలు రిషి ముందు కనిపించకుండా చాలా రోజులు అవుతోంది కదా. ముందు అది ఆలోచించండి. నా తమ్ముడిని కనిపెట్టండి. నా తమ్ముడు నాకు కావాలి. తను ఇంతకుముందు కూడా ఇంట్లో నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. తను ఎక్కడ ఉన్నాడో ఏంటో.. అసలు బతికి ఉన్నాడో లేదో అంటుంటే.. ఆపుతారా అంటుంది వసుధార. తనకు ఏమైనా అయితే ఎవ్వరినీ వదిలిపెట్టను అంటుంది వసుధార.

ఆ రోజు రౌడీలు వార్నింగ్ ఇచ్చారు. మన ఫ్యామిలీలో ఎవ్వరినీ వదిలిపెట్టం అన్నారు. అందుకే నేను మనమంతా జాగ్రత్తగా ఉండాలి. రిషికి కూడా ఎప్పుడైనా ఏదైనా జరిగే ప్రమాదం ఉంది.. అంటాడు శైలేంద్ర. రిషి ఎప్పుడూ నీకు చెప్పే ఎక్కడికైనా వెళ్తాడు కదా. ఎప్పుడూ చెప్పే రిషి.. ఈసారి ఎందుకు చెప్పకుండా వెళ్లాడు. ఆ కోణంలో ఆలోచించమని సార్ కు చెబుతున్నాను అంటాడు శైలేంద్ర.

దీంతో నేను కనిపెడతా.. అన్నీ కనిపెడతా. ఖచ్చితంగా వాళ్లను పట్టుకుంటా. ఆధారాలతో సహా పట్టుకుంటా. దీన్ని ఎవరు పక్క దారి పట్టిస్తున్నారో కూడా తెలుసుకుంటా అని అంటాడు ముకుల్. ఆ తర్వాత తన క్రిమినల్ మైండ్ తో శైలేంద్ర తప్పించుకున్నాడు అని వసుధార.. మహీంద్రాతో అంటుంది. టెక్నాలజీని అడ్డుపెట్టుకొని అందరినీ మోసం చేశాడు అంటాడు మహీంద్రా.

కళ్ల ముందు సాక్ష్యం ఉన్నా మనం ఏం చేయలేకపోతున్నాం అంటుంది వసుధార. ఈరోజు బయటపడ్డాడు. కానీ.. ఖచ్చితంగా వాడి నిజస్వరూపం బయటపడుతుంది అంటాడు మహీంద్రా. రిషి సార్ ఎక్కడికి వెళ్లి ఉంటారు అని టెన్షన్ పడుతుంది వసుధార. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మామయ్య అంటుంది వసుధార. ఈ ఇంటరాగేషన్ తర్వాత శైలేంద్ర మీద ఉన్న అనుమానం ఇంకా బలపడింది. వాడి మీద జరిగిన అటాక్ వాడే చేయించుకున్నాడు అని అంటుంది. తప్పు చేసిన వాడు ఏ రోజుకు అయినా ఖచ్చితంగా దొరికి తీరుతాడు. దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే. రిషికి శైలేంద్ర మీద ఏదో ఒక అనుమానం వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా రిషి ఏదో ఒకటి ఆలోచిస్తాడు. అసలైన సాక్ష్యాలు సంపాదిస్తాడు. ముందు మనం రిషిని వెతకాలి. తను దొరికితే అన్నింటికీ సమాధానం దొరుకుతుంది అని అంటాడు మహీంద్రా.

మరోవైపు దేవయాని చాలా సంతోషిస్తుంది. అసలు నువ్వు మామూలోడివి కాదు నాన్న. అసలు ఏంట్రా నీ ఆలోచనలు అంత అద్భుతంగా ఉన్నాయి అంటే నా ఆలోచనలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి. అందుకే మనం ఎన్ని నేరాలు చేసినా మనం బయటపడలేదు అంటాడు. నువ్వు ఇలాంటి వాటిపైన ఏ యూనివర్సిటీలో అయినా కోర్సు చేశావా అంటే చేశా మామ్. నా గురువు దేవయాని అంటాడు శైలేంద్ర. నేరాలు ఘోరాలు చేయడంలో వాటి నుంచి బయటపడటంలో నీకన్నా నేర్పరి ఎవరూ లేరు మామ్ అంటాడు శైలేంద్ర. వీళ్లు మాట్లాడుకునే మాటలు అన్నీ డోర్ పక్కన నిలబడి ధరణి వింటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

5 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

7 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

9 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

9 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

13 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

15 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

1 day ago