Guppedantha Manasu 18 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 18 నవంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 924 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రా కోసం డీబీఎస్టీ కాలేజీకి వెళ్తుంది అనుపమ. కాలేజీకి వెళ్లి అందరినీ అడుగుతుంది అనుపమ. మహీంద్రా కాలేజీకి రావడం లేదు అని చెబుతారు స్టాఫ్. ఇంతలో శైలేంద్ర కాలేజీకి కారులో వస్తాడు. అక్కడ అనుపమను చూస్తాడు. తను ఇక్కడ ఏం చేస్తోంది అని అనుకుంటాడు శైలేంద్ర. వెంటనే తన ఫోన్ లో రికార్డు చేస్తాడు శైలేంద్ర. రిషి, వసుధార వచ్చాక వాళ్లను కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనుపమ. స్టాఫ్ దగ్గరికి వెళ్లి ఆమె మీతో ఏం మాట్లాడింది అంటే.. మహీంద్రా సార్ గురించి అడిగింది అని చెబుతారు. వెంటనే దేవయానికి ఫోన్ చేస్తాడు శైలేంద్ర. మామ్.. నీకో ఫోటో పంపించాను చూశావా అంటాడు. ఏం ఫోటో అంటే.. అనుపమ ఫోటో అంటాడు. తను కాలేజీకి వచ్చింది అంటాడు. ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది. తను ఇప్పుడు కాలేజీకి ఎందుకు వచ్చింది అంటే.. లేటు వయసులో చదువు మీద శ్రద్ధ పెరిగిందా ఏంటి అంటే.. జగతి చావు మీద డౌట్ వచ్చింది. అందుకే కాలేజీలో అందరినీ ఎంక్వయిరీ చేస్తోంది. రిషి, వసుధారతో మాట్లాడాలట. వాళ్లు ఇంకా కాలేజీకి రాలేదు అంటాడు. దీంతో నువ్వు ఒక పని చేయి.. దాన్ని మన ఇంటికి తీసుకురా అంటుంది దేవయాని. దాన్ని మనింటికి తీసుకురావడం ఏంటి అంటే.. దాని ఆలోచన మార్చితేనే ఈ విషయాన్ని మరిచిపోతుంది.. అంటుంది. దీంతో ట్రై చేస్తా అంటాడు శైలేంద్ర.
కాలేజీలో లోపలికి వెళ్తున్న అనుపమను చూసి మేడమ్.. ఎవరు కావాలి అని అడుగుతాడు. మహీంద్రా కోసం వచ్చాను అంటే.. మా బాబాయి కోసం వచ్చారా అంటాడు. అంటే మీరు అని అడుగుతుంది. దీంతో ఫణీంద్రా కొడుకు శైలేంద్రను అంటాడు. అంటే.. దేవయాని కొడుకువే కదా అంటుంది. దీంతో మా అమ్మ తెలుసా అంటే.. తెలుసు అంటుంది. దీంతో వెంటనే దేవయానికి ఫోన్ చేస్తాడు శైలేంద్ర. మీ ఫ్రెండ్ అనుపమ కలిసింది అంటాడు. దీంతో తనను ఇంటికి తీసుకురా అన్నట్టుగా మాట్లాడుతాడు. నువ్వే మాట్లాడు అంటే.. అనుపమ బాగున్నావా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. నువ్వు మా ఇంటికి రా. నీతో జగతి గురించి అన్ని విషయాలు మాట్లాడాలి అంటూ యాక్షన్ చేస్తుంది దేవయాని. దీంతో తన ఇంటికి వెళ్తే జగతి గురించి ఏదైనా తెలుస్తుందేమే అని అనుకుంటుంది. ముందు రిషి, వసుధారతో మాట్లాడాలి అని చెబుతుంది అనుపమ. దీంతో వాళ్లు ఈరోజు రారు కావచ్చు. బయట ఏదో మీటింగ్ ఉంది అని అన్నారు అంటాడు. కానీ.. అప్పుడే కాలేజీకి కారులో వస్తారు రిషి, వసుధార. వాళ్లు లేట్ గా వస్తారు కావచ్చు. మీరు ఇంటికి రండి వెళ్దాం అంటాడు శైలేంద్ర. దీంతో సరే వెళ్దాం పదా అంటుంది అనుపమ.
ఇంతలో తనను తీసుకొని వెళ్తుండగా అప్పుడే కాలేజీకి రిషి, వసుధార వెళ్తుంటారు. వాళ్లను చూసి శైలేంద్ర షాక్ అవుతాడు. వాళ్లను అనుపమ చూడకుండా ఉండేందుకు మేడమ్ ఒకసారి ఇలా వస్తారా అంటాడు. ఎందుకు అంటే.. రండి మేడమ్ మీకే తెలుస్తుంది అంటాడు. తనను పక్కకు తీసుకెళ్తాడు. ఇంతలో అక్కడి నుంచి రిషి, వసుధార వెళ్లిపోతారు. జగతి ఫోటో ఉన్న రూమ్ కు తనను తీసుకెళ్తాడు. ప్రతి రోజు కాలేజీకి రాగానే పిన్నికి దండం పెట్టుకుంటాను అంటాడు శైలేంద్ర.
ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది అనుపమ. దేవయాని, అనుపమ.. ఇద్దరూ మాట్లాడుకుంటారు. జగతి, మహీంద్రా పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా అంటే ఆ తర్వాత ఇష్టపడ్డాను అంటుంది దేవయాని. జగతి గురించి మహీంద్రా గురించి అన్నీ మంచిగా అనుపమకు చెబుతుంది. శైలేంద్ర, దేవయాని మీద ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా తెగ జాగ్రత్తలు తీసుకుంటుంది శైలేంద్ర.
జగతి ఎలా చనిపోయింది అని అడిగితే ఎవరో రౌడీ ఎదవ రిషిని కాల్చబోతే జగతి అడ్డుకోబోయిందట. అప్పుడే జగతి చనిపోయిందట. అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. స్పాట్ లో ఉంది రిషి, జగతి, వసుధార. పిన్ని ఎండీగా ఉన్నప్పటి నుంచి తనకు ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. వసుధార, పిన్నికి మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ వచ్చేవి. మీరెప్పుడూ ఎండీ సీటును కావాలనుకోలేదా అని అడుగుతుంది అనుపమ. దీంతో నాకెందుకండి ఎండీ సీటు. అంత పెద్ద పదవులు నేను మోయలేను అంటాడు శైలేంద్ర. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా అంటే.. అదేం లేదు డాడ్ లాగే నేను కాలేజీకి వెళ్తాను. అడ్మినిస్ట్రేషన్ పదవి చూసుకుంటాను అంటాడు శైలేంద్ర. మా కాలేజీ మీద ఎవరో కన్నేశారు. జగతి ఆ సీటులో కూర్చోవడం ఇష్టం లేక ఎన్నో కుట్రలు చేశారు అంటుంది దేవయాని. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.