
intinti gruhalakshmi 18 november 2023 saturday full episode
Intinti Gruhalakshmi 18 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 18 నవంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1105 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన మధ్య స్నేహబంధమే బెటర్. దాన్నే కంటిన్యూ చేద్దాం అని అంటుంది తులసి. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో మధ్యలో నుంచే క్యాండిల్ లైట్ డిన్నర్ నుంచి వచ్చేస్తారు. మరోవైపు సరస్వతి అంత్యక్రియలు చేయడానికి అన్నీ సిద్ధం చేస్తుంటారు. తులసి ఎక్కడుందో అర్థం కాదు. తులసి ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో మా తులసికి చివరి చూపు చూసే అదృష్టం ఉందో లేదో అని అనుకుంటుంది అనసూయ. మరోవైపు దివ్య, విక్రమ్ ఇద్దరూ వస్తారు. దివ్య.. తన మీద పడి ఏడుస్తుంది. అమ్మమ్మ లే అమ్మమ్మ అంటూ ఏడుస్తుంది. మామయ్య అంటూ దీపక్ మీద పడి ఏడుస్తుంది దివ్య. మరోవైపు రాములమ్మ ఇంట్లో తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తులసమ్మ గారికి ఈ విషయం తెలుసో తెలియదో.. అని అనుకుంటుంది. అమ్మ గారు ఈ విషయం విని తట్టుకోగలరా అని అనుకుంటుంది. అయ్యో అని అనుకుంటుంది. మరోవైపు కారులో తెల్లవారగానే ఇంటికి చేరుకుంటారు తులసి, నందు. అమ్మ గారు వచ్చినట్టు ఉన్నారు అనుకొని ఇంటి ముందుకు వెళ్తుంది రాములమ్మ. అమ్మ.. తులసమ్మ అంటుంది. ఏమైంది రాములమ్మ ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది.
మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటుంది. మీ అమ్మ గారు దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు అంటుంది రాములమ్మ. దీంతో తులసి తట్టుకోలేక తనకు కళ్లు తిరిగి పడిపోతుంది. వెంటనే నందు, రాములమ్మ పట్టుకుంటారు. పెద్దదాన్ని అయిపోయాను.. ఏరోజు ఎలా ఉంటుందో నాకు తెలియడం లేదు. తెల్లవారితే కళ్లు తెరుస్తానో లేదో కూడా నాకు తెలియదు. నేను పోయేటప్పుడు మాత్రం నువ్వు నా పక్కనే ఉండాలి అంటూ సరస్వతి అన్న మాటలను గుర్తుకు చేసుకుంటుంది తులసి. అమ్మ అంటూ బోరున విలపిస్తుంది. ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది. దీంతో ఈరోజు ఉదయమే అంటుంది. మరి నాకెందుకు చెప్పలేదు అంటే.. నీకు కాల్ చేసింది అందుకే అయి ఉంటుంది అని నందు మనసులో అనుకుంటాడు. త్వరగా వెళ్లండి అమ్మ. కనీసం ఆఖరి చూపు అయినా దక్కుతుందేమో అంటుంది రాములమ్మ. దీంతో తులసి వెంటనే అదే కారులో బయలుదేరుతుంది.
మరోవైపు అంత్యక్రియలకు అన్నీ సిద్ధం చేస్తారు. దీపక్.. తన తల్లికి తలగోరు పెడతాడు. మరోవైపు తన తల్లి చివరి చూపు కోసం తపిస్తుంటుంది తులసి. కారులో వస్తూ ఉంటుంది. మరోవైపు అంత్యక్రియలు ప్రారంభం అవుతాయి. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేద్దామా.. తులసి వస్తుందేమో అంటాడు పరందామయ్య. దీంతో అక్క రాదు. తను మారిపోయింది.. అంటాడు దీపక్. తను రాదు.. ఎదురు చూపులు తప్ప లాభం ఉండదు అంటాడు దీపక్. అంత్యక్రియలు స్టార్ట్ అవుతాయి. కారు అక్కడ ఆపి.. పరిగెడుతూ ఉంటుంది తులసి. అయినా కూడా అప్పటికే సరస్వతి చితికి నిప్పు అంటిస్తాడు దీపక్. అప్పుడే అక్కడికి వచ్చి గుక్క పెట్టి మరీ ఏడుస్తుంది తులసి. కానీ.. అప్పటికే మంటల్లో సరస్వతి కాలిపోతుంది.
నాకు చెప్పకుండా ఇంత పని చేస్తావా? నువ్వు నా తమ్ముడివేనా? నీకు, నాకు ఇక బంధం తెగిపోయింది అంటుంది తులసి. నువ్వు చేసింది మామూలు తప్పు కాదు అంటుంది. అమ్మతో పాటే అక్క కూడా చచ్చిపోయింది అనుకో అంటుంది తులసి. నాకు బతకాలని లేదు. నాకు ఈ ఒంటరి బతుకు వద్దు అంటుంది తులసి. అమమ్తో పాటే నన్ను కూడా పంపేయ్.. నీకు ప్రశాంతంగా ఉంటుంది అంటుంది తులసి.
ఆ తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక సరస్వతి గురించే తలుచుకొని బాధపడుతూ ఉంటారు. దీపక్ కూడా వస్తాడు. అక్క అంటాడు. రేయ్.. నీకు ఏం చెప్పాను. ఈ ఇంటి గడప తొక్కొద్దు. నీ మొహం చూపించొద్దు అన్నానా? ఎందుకు వచ్చావు అంటుంది తులసి. వెళ్లు.. నా కళ్ల ముందు నుంచి వెళ్లు అంటుంది తులసి. తప్పు అమ్మ అలా అనకూడదు అంటాడు పరందామయ్య. తను కూడా నీలాగే అమ్మ పోయిన బాధలో ఉన్నాడు అంటాడు పరందామయ్య.
వాడు చేసింది మామూలు తప్పు కాదు. అమ్మ ఆఖరి చూపు కూడా చూడకుండా చేశాడు అంటుంది తులసి. నేను చెప్పేది విను అంటే వినను అంటుంది తులసి. వెళ్లిపో ఇక్కడి నుంచి అంటుంది. నీ ఫోన్ కలిసి ఏంటే అమ్మ బతికేది అంటాడు దీపక్. దీంతో వెంటనే నందును పిలుస్తుంది. మా అమ్మను చంపిన హంతకులు మీరే అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.